ఎన్టీఆర్ నమ్మితే ఎంతదూరమైనా వస్తాడు...

పలు తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన తెలుగు ప్రముఖ నటుడు “అజయ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు అజయ్ 2000వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాగ బాబు హీరోగా నటించిన “కౌరవుడు” అనే చిత్రం ద్వారా నటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

 Telugu Actor Ajay React About Friendship With Jr Ntr, Telugu Actor, Ajay, Jr Ntr-TeluguStop.com

ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఖుషి, స్టూడెంట్ నెంబర్ వన్, స్నేహం, ఒక్కడు, సింహాద్రి, వర్షం, తదితర చిత్రాలలో విలన్ పాత్రలో నటించే అవకాశాలు దక్కించుకునే బాగానే అలరించాడు.కాగా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన స్నేహితుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితుడని చెప్పుకొచ్చాడు.

అంతేకాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారి స్నేహం చేస్తే తనకోసం ఎంత దూరమైనా వస్తాడని చాలా మంచి మనసున్న వ్యక్తి అని ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఎన్టీఆర్ తో తాను “స్టూడెంట్ నెంబర్ వన్” చిత్రం నుంచి ట్రావెల్ చేస్తున్నానని దాంతో ఎన్టీఆర్ గురించి ప్రొఫెషనల్ పరంగా తనకు చాలా బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.

అలాగే ఎన్టీఆర్ నటన పరంగా లేదా డాన్స్ పరంగా ఏదైనా సరే దర్శక నిర్మాతల అంచనాలను అందుకుంటూ తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేస్తాడని తన అభిప్రాయాన్ని తెలిపాడు.అలాగే ఏదైనా ఒక విషయం గురించి తారక్ ఆలోచించే విధానం మరియు రెస్పాండ్ అయ్యే తీరు తనకి బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చాడు.

Telugu Ajay, Ajayjr, Jr Ntr, Telugu, Teluguajay, Tollywood-Movie

అలాగే భవిష్యత్తులో ఓటీటీలతో కలిసి ఒరిజినల్ చిత్రాలను తెరకెక్కించి విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు.అలాగే తన లైఫ్ లో చాలా సంతోష పడిన విషయం గురించి స్పందిస్తూ తన పెద్ద కొడుకు జన్మించినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యానని తెలిపాడు.ఇక బాహుబలి చిత్రంలో ప్రముఖ నటుడు “సుబ్బరాజు” నటించిన పాత్రలో నటించే అవకాశం తనకి దక్కి ఉంటే చాలా సంతోషించేవాడినని కానీ సుబ్బరాజు కూడా ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం  అజయ్  తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube