ఆ రోజు 'స్ట్రాబెర్రీ మూన్' గా దర్శనం ఇయనున్న చంద్రుడు..!

2021 సంవత్సరం లో చంద్రుడు సూపర్ మూన్ బ్లడ్ మూన్ గా కనిపించి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.అయితే వచ్చే పౌర్ణమి నాడు అనగా జూన్ 24వ తేదీన చంద్రుడు స్ట్రాబెర్రీ మూన్ గా కనిపించి ప్రజలకు కనులవిందు చేయనున్నాడట.

 The Moon Will Appear As 'strawberry Moon' On That Day Strawberry, Moon, June 24-TeluguStop.com

భూకక్ష్యలోకి అతి సమీపంగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణ పరిమాణం కంటే కొంచెం పెద్దగా కనిపిస్తాడు.అయితే మే నెలలో చంద్రుడు భూకక్ష్యలోకి ప్రవేశించి కాస్త పెద్దగా కనిపించడం తో దానిని సూపర్ మూన్ అని పరిగణించారు.

అయితే వచ్చే పౌర్ణమి నాడు కూడా ఇదే విధంగా సాధారణ స్థాయి కంటే పెద్దగా కనిపించనున్నాడు.కానీ ఈసారి చంద్రుడిని సూపర్ మూన్ గా పిలవరు.ఎందుకంటే ప్రతి పౌర్ణమి ని పరిగణలోకి తీసుకొని పెద్దగా కనిపించే చంద్రుడికి వివిధ రకాలుగా పేర్లు పెడతారు.ఐతే వసంత రుతువు చివరి పౌర్ణమికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు.

Telugu June, Moon, Strawberry, Latest-Latest News - Telugu

స్ట్రాబెర్రీ మూన్ అని ఎందుకు పిలుస్తారంటే:

వసంత రుతువు చివరి పౌర్ణమితోనే అమెరికా దేశంలో స్ట్రాబెర్రీల పంట కాలం ప్రారంభమవుతుంది.అందుకే ప్రాచీన అమెరికన్లు వసంత రుతువు చివరి పౌర్ణమి కాలంలో పెద్దగా కనిపించే చంద్రుడికి స్ట్రాబెర్రీ మూన్ అని నామకరణం చేశారు.ఐతే ఈ పౌర్ణమికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి.ఐరోపాలో ఈ పౌర్ణమి ని రోజ్ మూన్ అని పిలుస్తుంటారు.ఐరోపాలో గులాబీలు పెంచే సమయంలో ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి దీనికి ఈ పేరు పెట్టారు.ఇక ఈ పౌర్ణమి తోనే ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం ప్రారంభం అవుతుంది.

అందువల్ల దీనిని హాట్ మూన్ అని కూడా పరిగణిస్తారు.

ఐతే ఈ మూన్ పూర్తి దశ ఒక రోజు వరకు ఉంటే అది సాధారణ చంద్రుడిలా కాకుండా, స్ట్రాబెర్రీ చంద్రుడిలా రాత్రి సమయంలో ఆకాశంలో ఒక రోజు పైగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube