లేటు వయసులో 'ఎంట్రిప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్' గా మారిన భామ..!

సాధారణంగా 70 ఏళ్ల వయసు దాటిన మనుషులు సొంత పనులు చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు.కానీ చండీఘడ్ కి చెందిన హర్భజన్ కౌర్ అనే ఒక బామ్మ తన 90 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించి ఆశ్చర్యపరుస్తున్నారు.

 Bhama Who Became 'entrepreneur Of The Year Award' At A Young Age Harbhajan Kaur,-TeluguStop.com

ఆమె తన వ్యాపారంలో చక్కగా రాణిస్తూ ఔత్సాహిక వ్యాపారులందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.ఈ వయసులో వ్యాపారం ఏంటని ప్రశ్నించిన వారందరికీ.

అభిరుచికి వయసుతో పనేముందని ఆమె సమాధానం ఇస్తున్నారు.అయితే ఒకరోజు ఆమె తన కూతురు తో మాట్లాడుతూ జీవితం మొత్తంలో తన చేతితో ఒక్క పైసా కూడా సంపాదించలేదని చెప్పారట.

దీంతో కూతురికి ఒక ఉపాయం తట్టింది.అదేంటంటే తన తల్లి హర్భజన్ కౌర్ తినుబండారాలు చాలా రుచిగా తయారు చేయగలరని.

ఆమె చేత వంటలు చేసి స్థానిక షాప్ లోకి విక్రయిస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేశారు.

అదే ఆలోచనతో హర్భజన్ కౌర్ గంటల కొద్దీ శ్రమపడి తినుబండారాలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు.

అయితే హర్భజన్ కౌర్ బర్ఫీ లు తయారు చేయడంలో సిద్ధహస్తురాలు.దీంతో అవి కూడా తయారు చేసి అమ్మడం ప్రారంభించారు.ఎన్నో గంటలు కష్టపడి తయారు చేసిన ఆ బర్ఫీ లు నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవట.అయితే ఈ భామ తన కుకింగ్ టాలెంట్ తో రోజుకి రెండు వేల రూపాయలకు పైగా సంపాదించారట.90 ఏళ్ల వయసులోనూ కుర్రకారుకి ధీటుగా రెండు చేతులా సంపాదిస్తున్న భామ అనతికాలంలోనే బాగా ఫేమస్ అయ్యారు.

Telugu Harbhajan Kaur, Latest-Latest News - Telugu

2020లో ఇంట్రెప్రెనేర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆమె వ్యాపారంపై ప్రభావం పడింది.అదే సమయంలో ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఐతే 90 ఏళ్ల వయసులోనూ ఆమె కరోనా ని జయించారు.ఐతే తాజాగా ప్రముఖ ఫేసుబుక్ పేజ్ హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి ఈ 90 ఏళ్ల పారిశ్రామికవేత్త కథను ప్రచురించింది.

కాగా ప్రస్తుతం ఆమె గురించి రాసిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.వాస్తవానికి ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 12 వేల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చేసిన వంటలను మనవరాళ్లు పోస్ట్ చేస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube