కేసీఆర్‌లో ఎందుకింత మార్పు.. జిల్లాల ప‌ర్య‌ట‌న వెన‌క కార‌ణం అదేనా?

కేసీఆర్ మీద ఎప్ప‌టి నుంచో ఓ విమ‌ర్శ బ‌లంగా ఉండేది.ఎవ‌రేమ‌నుకున్నా ఆయన‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ విడిచి రాలేడ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించేవి.

 Why The Change In Kcr Is There A Reason Behind The District Tour, Kcr, Etala, Po-TeluguStop.com

ఎంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా ఆయ‌న మాత్రం క‌నీసం ప‌రామ‌ర్శ‌కు కూడా రాడ‌ని ఓ పేరుండేది.అదేంటో గానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్‌నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచే కేసీఆర్‌లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న యాక్టివ్ ప‌నులు చేస్తున్నారు.

వ‌రుస‌గా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుడుతున్నారు.

ఎంద‌కంటే ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా రెండో స్థానంలో ఉండి పోరాడిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు.దీంతో ఆ పార్టీ బ‌లం అనూహ్యంగా పెరుగుతోంది.దీంతో క‌మ‌ల‌నాథులు 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఫోకస్ పెడుతున్నారు.ఇప్పుడు హుజూరాబాద్ లో గెలిస్తే బీజేపీని ఆప‌డం సాధ్యంకాదు.

అస‌లు నాలుగు సార్లు గెలిచిన చ‌రిత్ర ఈట‌ల రాజేంద‌ర్‌కు ఉంది.

అలాంటి హుజూరాబాద్‌లో ఈట‌ల‌ను ఢీ కొట్టాలంటే వ్యూహాలు అమ‌లు చేయాల్సిందే.

ఇంకోవైపు ఈట‌ల‌కు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న సానుభూతిని దెబ్బ‌కొట్టాల‌ని కేసీఆర్ ఈ విధంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

Telugu @cm_kcr, General, Eetala Rajendar, Etela Effect, Etela Kcr, Kcr-Telugu Po

హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులు చేసి మిగ‌తా చోట్ల చేయ‌కుంటే ఎన్నిక‌ల కోస‌మే అనుకుంటార‌ని సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.ఇంకోవైపు ఎన్నికలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే కేసీఆర్ జిల్లాల‌కు వ‌స్తార‌నే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ్రేక్ వేసేందుకు ఈ విధంగా కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు.మ‌రి ఆయ‌న చేస్తున్న ప‌నులు ఏ మేర‌కు వ‌ర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.

ఏదేమైనా కేసీఆర్‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఎఫెక్ట్ కేసీఆర్‌లో స్ప‌ష్ట‌మైన మార్పు తెచ్చింద‌నే చెప్పాలి.మ‌రి హుజూరాబాద్‌లో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.ఈట‌లకు మాత్రం రోజురోజుకూ ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరుగుతోంద‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube