నాగార్జున కెరియర్ లో సోగ్గాడే చిన్నినాయనా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అతని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చిత్రంగా అది నిలిచింది.
దానికి సీక్వెల్ ఉంటుందని మూడేళ్ళ క్రితమే నాగార్జున ప్రకటించాడు. బంగార్రాజు టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు.
ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణకి నాగార్జున తన బ్యానర్ లో కొడుకుతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.రారండోయ్ వేడుకచేద్దాం సినిమాతో కళ్యాణ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే మూడో సినిమాని రవితేజతో తీసి డిజాస్టర్ కొట్టాడు.దీంతో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డ మళ్ళీ నాగార్జున పిలిచి బంగార్రాజు సీక్వెల్ బాద్యతలని అప్పగించారు.
ఇక ఎట్టకేలకు బంగార్రాజు కథతో కళ్యాణ్ కృష్ణ నాగార్జునని మెప్పించాడు.దీంతో ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే క్యాస్టింగ్ సెలక్షన్ కూడా జరిగిపోయినట్లు తెలుస్తుంది.ఇందులో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
అతనికి జోడీగా సమంత కనిపించే అవకాశం ఉంది.ఇక మొదటి పార్ట్ లో ఉన్న రమ్యకృష్ణ పాత్ర కొనసాగింపు ఉంటుంది.
మరో హీరోయిన్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు.లావణ్య త్రిపాఠికి ఈ సీక్వెల్ లో ఛాన్స్ దక్కలేదు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో నాగార్జున అత్త పాత్ర కోసం సీనియర్ నటి జయప్రదని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ఈ మధ్య సినిమాలపై కూడా ఆమె శ్రద్ధ పెట్టడంతో జయప్రదని కీలక పాత్ర కోసం ఫైనల్ చేశారని సమాచారం.
ఇక జులై, ఆగష్టులో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.