ఈటెలకు బీజేపీ కేంద్ర నాయకత్వం అండగా నిలవనుందా?

తెలంగాణలో ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే కేసీఆర్ లాంటి నేతతో విభేదించి బీజేపీలోకి వెళ్లిన ఈటెల తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్న పరిస్థితి ఉంది.

 Should The Bjp Central Leadership Stand By The Side Of Etela Rajender, Bjp Party-TeluguStop.com

అయితే ఇంతలా ఈటెల ధైర్యంగా ఉండడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం ఈటెలకు అండగా ఉంటామని భరోసానివ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోందనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది.అయితే దీనిపై ఎవరూ స్పందించకున్నా ఊహగానాలుగానే మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బండి సంజయ్ లాంటి నేతలు హుజూరాబాద్ లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే హుజూరాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట అన్న విషయం తెలిసిందే.

ఏది ఏమైనా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమిని కెసీఆర్ ఒప్పుకోడన్న విషయం తెలిసిందే.ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాలేదు కాబట్టి ఇప్పుడే కెసీఆర్ స్పందించక పోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Telugu Amit Sha, Bandi Sanjay, Centralbjp, Etela Rajender, Huzurabad, Jp Nadda,

అయితే ఈటెలకు బీజేపీ కేంద్ర నాయకత్వం అండదండలున్నాయనేది మాత్రం వాస్తవంలా కనిపిస్తోంది.మరో దుబ్బాకలా హుజూరాబాద్ మారబోతున్న పరిస్థితులలో దుబ్బాక తరహాలో బీజేపీ హుజూరాబాద్ లో కూడా గెలిస్తే బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube