బీజేపీకి జ‌న‌సేన దూరం అవుతోందా... ప‌వ‌న్ మౌనం వెన‌క అర్థం ఏంటి..?

ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది.ఇప్ప‌టి వ‌కు వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు జోరుమీద రాజ‌కీయాలు జ‌రిగితే ఇప్పుడు జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

 Is Janasena Moving Away From Bjp What Is The Meaning Behind Pawans Silence , Pav-TeluguStop.com

ఎందుకంటే బీజేపీ వేస్తున్న ప్లాన్లు జ‌న‌సేన‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారు.అయితే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డ‌ప్ప‌టి నుంచి అస‌లు రాజ‌కీయాలుపై పెద్ద‌గా స్పందించ‌ట్లేదు.

క‌నీసం ఒక‌ట్వీట్ కూడా చేయ‌కుండా మౌనంగా ఉంటున్నారు.

ఇంకోవైపు బీజేపీ ఏపీలో ఎలాగైనా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని ఎద‌గాల‌ని చూస్తోంది.

కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం కొన్ని రోజులుగా బీజేపీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం జగన్ ప్ర‌భుత్వంపై బీజేపీ అనేక ఉద్యమాలకు పిలుపినిస్తూ రోజుకో ఏరియాలో నిర‌స‌న‌లు తెలుపుతోంది.

కానీ త‌మ‌తో పొత్తు ఉన్న జ‌న‌సేన మాత్రం ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొన‌ట్లేదు.ఇక్క‌డే వ‌ప‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాలు అర్థం కావ‌ట్లేదు.బీజేపీతో క‌లిసి నిర‌స‌న‌లు చేస్తే క్రెడిట్ మొత్తం త‌మ‌కు రాద‌నే భావ‌న‌లో జ‌న‌సేన ఉంది.అయితే ఈ నిర‌స‌నల‌పై లేదా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నీసం ఒక ట్వీట్ కూడాచేయ‌క‌పోడమే పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.

Telugu @bjp4india, Ap Bjp, Ap Cm Jagan, Ap, Janasena, Janasenapavan, Pawan Kalya

దీన్ని బ‌ట్టి చూస్తే ప‌వన్ మ‌దిలో బీజేపీతో విడిపోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.కార‌ణం ఏంటంటే బీజేపీ నీడ‌లో ఉంటే త‌మ పార్టీకి అనుకున్నంత గుర్తింపు రాద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారు.ఒక‌వేళ పొత్తులోనే కొన‌సాగితే ప్ర‌తి విష‌యంలో బీజేపీ కేంద్ర అధిష్టానం చెప్పిన‌ట్టు వినాల్సి వ‌స్తుంద‌ని జ‌న‌సేన అధినేత అనుకుంటున్నారు.కాక‌పోతే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌కుండా నాన్చుతున్నారు ప‌వ‌ర్ స్టార్‌.

మ‌రి ఆయ‌న క‌మ‌లం గూటిలోనే ఉంటారా లేక రాజ‌కీయ ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో త‌మ పార్టీని సెప‌రేటుగా ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది.ఏదేమైనా ప‌వ‌న్ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube