భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించిన కెనడా...!!

ప్రపంచ దేశాలకు వలసలు వెళ్ళిన వారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు.మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ నుంచీ వచ్చే వారికే దాదాపు అన్ని దేశాలు అత్యధిక ప్రాధన్యత ఇస్తూ ఉంటాయి.

 Indian Origin Angad Singh Appointed As Official In Canadian Govt, Angad Singh, C-TeluguStop.com

భారతీయుల ప్రతిభ కు పట్టం కట్టని దేశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు.భారతీయులు అన్ని దేశాలలో అక్కడి వివిధ రంగాలలో క్రియాశీలక భూమిక పోషిస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యం భారతీయులకు రెడ్ కార్పెట్ పరచడమే కాకుండా ప్రభుత్వంలో కీలక పదవులను అప్పగిస్తూ మనవారి సేవలను పొందుతోంది.ఇక

అమెరికా భారతీయులకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభావమో, ఏమో కానీ కొన్ని దేశాలలో భారతీయులకు ఆయా దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.

ఎంతో మంది భారత సంతతి వ్యక్తులకు కీలకమైన శాఖల బాధ్యతలు, అత్యున్నత పదవులు అప్పగిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం కెనడా ప్రభుత్వం భారత సంతతికి చెందిన జస్టిస్ మహ్మద్ జమాల్ కు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత కీలకమైన భాద్యతలు ఇస్తూ ఆదేశ ప్రధాని ట్రూడో ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

ఆయన్ను ఏకంగా సుప్రీంకోర్టు కు చెందిన సంపద అంటూ ట్రూడో కొనియాడారు.ఇదిలాఉంటే

రోజులు గడవక ముందో మరో భారత సంతతి వ్యక్తికి కెనడా మరో కీలక పదవి ఇచ్చి భారత సంతతి వ్యక్తుల ప్రతిభపై తమకు ఉన్న నమ్మకాన్ని చాటుకుంది.

భారత్ లోని పంజాబ్ కి చెందిన అంగద్ సింగ్ అనే వ్యక్తికి కెనడాలోని ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన రావణా మంత్రిత్వశాఖ లో డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తరువులు జారీ చేసింది ప్రభుత్వం.అక్కడి మౌంట్ అల్లిసన్ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన తరువాత రాజకీయాలపై మక్కువతో 2015 లో లిబరల్ పార్టీలో చేరారు.

ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన అంగద్ మెల్ల మెల్లగా ఎదుగుతూ నేడు రవాణా మంత్రిత్వశాఖలో కీలమైన భాద్యతలు చేపట్టారు.ప్రభుత్వం తనకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల అంగద్ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube