స్టార్ హీరో సినిమాకు నిర్మాతగా అలియా ?

చాలావరకు నటీనటులంతా దర్శకులుగా, నిర్మాతగా కూడా పరిచయమవుతున్నారు.ఓవైపు నటులుగా, మరోవైపు దర్శకనిర్మాతగా బాధ్యతలు తీసుకుంటూ బాగా బిజీ అవుతున్నారు.

 Bollywood Actress Alia Bhatt Turns Producer, Darlings Movie, Shah Rukh Khan, Sha-TeluguStop.com

ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ దర్శక నిర్మాతలుగా మారగా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక తాజాగా నిర్మాతగా మరో హీరోయిన్ పరిచయం కానుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.


బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ .ప్రస్తుతం ఈ బ్యూటీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తూ తొలిసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.ఇందులో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్రహ్మస్త్ర, గంగుబాయ్ ఖతియావాడి వంటి వరుస సినిమాలలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే అలియా భట్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టనుంది.

Telugu Alia Bhatt, Rrr, Shah Rukh Khan, Shahrukh, Turns-Movie

గతంలో అలియా భట్ నిర్మాతగా మారనున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక తాజాగా ఈ బ్యూటీ రంగంలోకి దిగడంతో తాను నిర్మించే సినిమా షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టిందట.పైగా తాను నిర్మించే సినిమాకు ‘డార్లింగ్స్’ అనే టైటిల్ కూడా పిక్స్ అవ్వగా ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ భాగస్వామిగా ఉండబోతుందని తెలుస్తుంది.

Telugu Alia Bhatt, Rrr, Shah Rukh Khan, Shahrukh, Turns-Movie

తొలిసారిగా నిర్మాతగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఎటువంటి చేదు అనుభవాలు ఎదురవకుండా మొదటి అడుగుతోనే సీనియర్ ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలిపిందని తెలుస్తుంది.మొత్తానికి అలియా భట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా.నిర్మాతగా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ నిర్మాతలుగా మారి పలు సినిమాలు నిర్మించగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube