తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మతి పోగొడుతున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ “అనసూయ భరద్వాజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పలు షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ వెండితెరపై కూడా ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులను నిలిపి వేయడంతో అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
ఈక్రమంలో అప్పుడప్పుడు లైవ్ మరియు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది.
కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అనసూయ కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ చిన్నప్పటి ఫోటోని షేర్ చేయాలని కోరాడు.
దీంతో అనసూయ భరద్వాజ్ తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది.దీంతో అనసూయ అభిమానులు ఆమె చిన్నప్పటి ఫోటో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అంతేకాకుండా చిన్నప్పుడు అనసూయ భరద్వాజ్ తన పాల బుగ్గలతో చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య అనసూయ భరద్వాజ్ సినిమాల పరంగా కొంత మేర స్పీడ్ పెంచింది.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు “కొరటాల శివ” దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరో గా “లైగర్” చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో నటిస్తూన్నట్లు సమాచారం.