ఆయుర్వేదం, సనాతన వైద్యమే స్పూర్తి: అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ సంస్థ ‘‘అరోమాజియా’’

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో సోమవారం ఉదయం నుంచి జనం వీధుల్లోకి వచ్చి సామూహికంగా యోగాసనాలు వేస్తున్నారు.

 Ayurveda Inspired Traditional Indian Beauty Wellness Brand Enters Us Market,  In-TeluguStop.com

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ ఆయుర్వేదం స్పూర్తితో మనదేశానికి చెందిన ప్రఖ్యాత బ్యూటీ అండ్ వెల్‌నెస్ బ్రాండ్ అమెరికాలో అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది.

భారత్‌కు చెందిన అరోమాజియా అనే సంస్థ తన ఉత్పత్తులను ఇకపై అమెరికాలోనూ విక్రయిస్తామని తెలిపింది.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో అరోమాజియా తన నూనెలు, అత్తర్, అరోమాథెరపీ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది.వీటిలో చాలా వరకు హిమాలయ పర్వత సానువుల్లో దొరికే వనమూలికలను ఉపయోగించి ఈ సంస్థ తయారు చేస్తోంది.

Telugu Aromagia, Aromatherapy, Attar, Wellness, Indian Ayurveda, Oils, Swapnil P

తమ సంస్థ ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు అరోమాజియాకు చెందిన స్వాప్నిల్ పాథక్.ఆయుర్వేదం, భారతీయ సనాతన వైద్యం స్పూర్తితో తన ముత్తాత 1911లో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో అరోమాజియాను స్థాపించారని ఆమె తెలిపారు.అందం, ఆరోగ్య సంరక్షణలో తమ ఉత్పత్తుల ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని స్వాప్నిల్ అన్నారు.అరోమాజియాను తన ముత్తాత తర్వాత తన తండ్రి కొనసాగించారని.ఇప్పుడు నాలుగో తరం సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తోందని ఆమె చెప్పారు.

Telugu Aromagia, Aromatherapy, Attar, Wellness, Indian Ayurveda, Oils, Swapnil P

2015లో దీనిని ప్రజలకు మరింత చేరువ చేసి ఒక బ్రాండ్‌గా మార్చానని స్వాప్నిల్ అన్నారు.ఇప్పుడు అమెరికాలో అరోమాజియాను లాంచ్ చేయడం సంతోషంగా వుందని ఆమె పేర్కొన్నారు.అమెరికన్ల స్పందనను బట్టి అక్కడ తమ బ్రాండ్‌కు శాశ్వత స్థానం దక్కుతుందని స్వాప్నిల్ ధీమా వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఈ రోజుల్లో సౌందర్య సాధనాల కంటే సహజ ఉత్పత్తులపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆమె అన్నారు.తొలకరి చినుకులు పడిన తర్వాత వచ్చే మట్టివాసనను పోలిన వాసన అరోమాజీయా అత్తర్ ప్రత్యేకత.

దీనిని భారతదేశ పెర్ఫ్యూమ్ రాజధాని అయిన కన్నౌజ్‌లో తయారు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube