మ‌రోసారి ఢిల్లీకి వెళ్లిన ఎంపీ కోమ‌టిరెడ్డి.. తెర‌వెనుక ఉత్త‌మ్‌?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప‌ద‌వుల పందేరం అనేది కామ‌న్‌గా మారిపోయింది.ఆ పార్టీలో ప‌ద‌వుల కోసం సొంత పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేసుకుంటారు.

 Mp Komatireddy Who Went To Delhi Once Again Uttamkumar Reddy Behind The Scenes,-TeluguStop.com

ఇక టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం వారు ఎంత‌గా హంగామా చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వీహెచ్, జ‌గ్గారెడ్డి లాంటి నాయ‌కులు త‌మ‌కే ప‌ద‌వులు ఇవ్వాల‌ని డైరెక్టుగా స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నారు.

ఇక రేవంత్ కు ఇవ్వొద్ద‌ని పెద్ద ఎత్తున లేఖ‌లు కూడా రాస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు.

ఇక ఇంకో నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అయితే మొద‌టి నుంచి త‌నకే ప‌ద‌వి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇందుకోసం స‌ర్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.మొన్న ఢిల్లీకి కూడా వెళ్లి మ‌రీ ప్ర‌య‌త్నాలు చేశారు.

కానీ ఆయ‌న పేరు కూడా ఇంకా ఫైన‌ల్ కాలేదు.కానీ ఆయ‌న మాత్రం ప్ర‌య‌త్నాలు ఆప‌కుండా అంది వ‌చ్చిన ప్ర‌తి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు.

ఇదే క్ర‌మంలో నిన్న ప్ర‌స్తుత టీపీసీసీ చీఫ్ అయిన ఉత్త‌మ్ కుమార్ పుట్టిన‌రోజు కావ‌డంతో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి హైద‌రాబాద్‌లో వ‌చ్చి మ‌రీ ఉత్త‌మ్‌ను ఆయ‌న ఇంట్లో క‌లిసి విషెస్ చెప్పారు.

అలాగే వీరిద్ద‌రూ రాష్ట్రంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై.

అలాగే టీపీసీసీ ప‌ద‌వి ఎవ‌రికి వ‌స్తుంద‌నే దానిపై, ఢిల్లీ అధిష్టానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే విష‌యాల‌పై సుదీర్ఘంగా మూడు గంటల పాటు చ‌ర్చించుకున్నారు.

Telugu Delhi Congress, Jagga, Komatireddy, Pcc, Revanth Kumar, Vhanumantha Rao-T

అయితే ఈ భేటీలో త‌న‌కు ప‌ద‌వి ఇచ్చేలా సాయం చేయాల‌ని ఉత్త‌మ్‌ను కోమ‌టిరెడ్డి కోరిన‌ట్టు తెలుస్తోంది.ఉత్త‌మ్‌తో భేటీ అనంత‌రం వెంక‌ట్‌రెడ్డి ఫ్లైట్‌లో హ‌స్తిన‌కు వెళ్లారు.అయితే ఉత్త‌మ్ మాట‌సాయంతోనే ఆయ‌న ఢిల్లీకి బ‌య‌లు దేరి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోసారి ఆయ‌న అధిష్టానాన్ని క‌లువ‌నున్న‌ట్టు తెలుస్తోంది.చూడాలి మ‌రి ఆయ‌న పేరు ఏమైనా ఫైన‌ల్ అవుతుందా లేదా అనేది.

ఏదేమైనా కోమ‌టిరెడ్డి మాత్రం రేవంత్‌కంటే ఎక్కువ‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube