న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఏపీ లో కొత్తగా వైసీపీ తరఫున గవర్నర్ కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.వివేకా హత్య కేసులో అనుమానితుల విచారణ

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 15వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది.ఈ హత్య కేసులో ఆరుగురు అనుమానితులను సిబిఐ విచారించింది.

3.అందుబాటులో కి ఎంఎంటీఎస్ రైళ్లు

వచ్చే వారం నుంచి తెలంగాణలో పది ఎంఎంటీఎస్ రైళ్లు నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

4.నేటి నుంచి కొత్త వ్యాక్సినేషన్ పాలసీ

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరుణ వ్యాక్సినేషన్ పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది.ఈ పాలసీ లో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేయనుంది .

5.నేటి నుంచి హరితహారం ప్రారంభం

హరితహారం లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు.

6.బిజెపి రాష్ట్ర కార్యాలయంకు మొదటి సారి గా ఈటెల

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మొదటిసారిగా వెళ్లారు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు బిజెపి కార్యాలయంలో ఈటెలకు బండి సంజయ్ ,  తదితరులు స్వాగతం పలికారు.

7.జులై 11 నుంచి గోల్కొండ బోనాలు

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే గోల్కొండ బోనాలు జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి.

8.నేడు సంగారెడ్డి లో మంత్రి హరీష్ రావు పర్యటన

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మంజీరా నది పై మణుగూరు మండలం బోరంచ లో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను హరీష్ ప్రారంభించనున్నారు.

9.బెజవాడ దుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పాలక మండలి సమావేశం ఈరోజు ప్రారంభమైంది దాదాపు 42 ఎజెండాలతో కూడిన ప్రతిపాదనలు పాలకమండలి ముందు ఉన్నాయి.

10.విద్యార్థులకు వ్యాక్సినేషన్ తర్వాతే తరగతులు

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

 తెలంగాణలో విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ డిమాండ్ చేశారు.

11.అన్న కాదు దున్న అంటూ లోకేష్ కామెంట్స్

రాజధానిలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.సొంత చెల్లి కి న్యాయం చేయలేనప్పుడు అన్న కాదు నాన్నా అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ విమర్శించారు.

12.జగన్ కు రఘురామ మరో లేఖ

శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

13.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.పార్టీ ఉపాధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశం

యూపీ తో సహా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు.

15.ఆ కారు నేను కొనలేదు : సోనూ సూద్

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన పెద్ద కుమారుడు మూడు కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారును బహుమతిగా అన వచ్చిన వార్తలపై సోను సూద్ స్పందించారు.ఈ వార్తలు ఎటువంటి నిర్ణయమూ లేదని ట్రైన్స్ కోసం మాత్రమే దానిని ఇంటికి తీసుకు వచ్చాము అని ఆయన చెప్పుకొచ్చారు.

16.ఆసుపత్రుల పై క్రిమినల్ కేసులు

ఏపీ వ్యాప్తంగా గత రెండు రోజుల్లో 15 ఆస్పత్రులను తనిఖీ చేసి తొమ్మిది ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ రెడ్డి తెలిపారు.

17.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,006 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.రేపటి నుంచి ఏపీ కి ఆర్టీసీ బస్సులు

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

అంతరాష్ట్ర బస్సు సర్వీసు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత సర్వీసులు యధావిధిగా నడవబోతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఏపీకి బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

19.ఆ కథనాలపై రకుల్ ఆగ్రహం

Telugu Ap Telangana, Cm Kcr, Corona India, Etela Rajender, Harish Rao, Job Calen

పిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్ అయినా పెట్టేస్తా రా అంటూ రకుల్ ప్రీతిసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి వచ్చిన కథనంపై ఆమె ఫైర్ అయ్యారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,210

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,210.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube