జగన్ పై పవన్ మౌనం ? బీజేపీ ఎఫెక్టేనా ? 

వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఓ నెల, రెండు నెలల క్రితం వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వచ్చారు.టిడిపి స్థాయిలో వైసీపీ పై విమర్శలు చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు .

 Janasena, Bjp, Tdp, Pavan Kalyan, Janasenani, Ap Cm Jagan, Ysrcp, Ap Government,-TeluguStop.com

ప్రతి విషయంపైనా జనసేన స్పందిస్తూ ఉండేది.పవన్ ప్రజా సమస్యలపై హడావిడి చేసేవారు.

అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై పవన్ విమర్శలు చేస్తున్న తీరుతో జనసైనికుల్లోనూ ఉత్సాహం కలిగించింది.సోషల్ మీడియాలోనూ పవన్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ, వైసిపి ప్రభుత్వ విధానాలను ట్రోల్ చేస్తూ జనసైనికులు హడావిడి చేసేవారు.

అయితే ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విషయం పైనా రియాక్ట్ కావడం లేదు.కేవలం నామమాత్రంగా జనసేన నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అవుతోంది.

అయితే పవన్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే విషయం పైన జోరుగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Modhi, Pavan Kalyan, Ys

టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏ విషయం పై అయితే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తారో అదే అంశాన్ని పవన్ లేవనెత్తారు అని, దానిపైనే విమర్శలు చేస్తూ చంద్రబాబుకు భజనపరుడిగా ఆయన ముద్ర వేయించుకున్నారు అంటూ పదే పదే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుండడంతో, పవన్ సైలెంట్ అయ్యారు అని, ఎన్నికల సమయం వరకూ పవన్ ఇదే విధంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, సినిమాలపైనే దృష్టిపెడతారు అనే వాదన ఒక వైపు వస్తోంది.

అయితే  బిజెపి పెద్దల సూచన తోనే టౌన్ సైలెంట్ అయ్యారని, ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో జగన్ చక్రం తిప్పారు అని, అందుకే పవన్ కళ్యాణ్ పెద్దగా రియాక్ట్ కావడం లేదనే మరో ప్రచారం తెరపైకి వచ్చింది.కారణం ఏదైనా పవన్ ఈ విధంగా సైలెంట్ కావడం మాత్రం జనసైనికులకు రుచించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube