సృష్టికి ప్రతిసృష్టి.. మగాళ్లకు గర్భం కోసం ప్రయోగాలలో దూసుకెళ్తున్న చైనా..!

ఈ ప్రపంచంలో పిల్లలకు జన్మనివ్వడం ఆడవాళ్లకు మాత్రమే సొంతం.పుడమిపై పేగు తెంచుకుని శిశువును జన్మించే హక్కు స్త్రీకి మాత్రమే ఉంది.

 Counter-creation To Creation China Rushing In Experiments For Pregnancy For Magh-TeluguStop.com

పది నెలలు మోసి పురిటి నొప్పులు భరించి పిల్లలకు జన్మనివ్వడం ఆడవారికి ఓ మధురానుభూతిని ఇస్తుంది.ఆ సమయంలో వారు పడే బాధ వర్ణణాతీతం.

అయితే ఇప్పటి వరకూ ఆడవారు మాత్రమే పిల్లలు కంటున్నారు దీనిపై చైనా పరిశోధనలు చేస్తోంది.మగవారు కూడా పిల్లల్ని కనే విధంగా పరిశోధనలు చేస్తోంది.

పురిటి నొప్పుల కష్టాలు మహిళలకు మాత్రమేనా పురుషులు కూడా ఆ నొప్పులు భరించినట్లైతే మహిళల గొప్పతనం తెలుస్తుంది.చైనా పరిశోధకులు కూడా దానిపైనే పరిశోధనలు చేస్తున్నారు.

పురుషులలో కూడా గర్భం దాల్చే విధానంపై చైనాలో చాలా రోజులుగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

Telugu China, China Scientiss, Latest, Male, Pregancy-Latest News - Telugu

గత కొన్ని సంవత్సరాలుగా మగవారు గర్భం దాల్చడంపై అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.శాస్త్రవేత్తలు చేసిన పలు ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.చైనాలో దాదాపుగా ఆ పరిశోధనలపై ఓ నివేదిక అనేది అందింది.

ఇలాంటి పరిశోధనలను చాలా దేశాలు నిషేధించాయి.అయితే మగవారిలో గర్భం దాల్చడంపై చైనాలో మాత్రం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

మొదటగా చైనాలో పరిశోధకులు ఎలుకలపై పరిశోధనలు చేశారు.ఎలుకలలో ఆ ప్రయోగాలు విజయవంతం అవ్వడంతో ఇప్పుడు పురుషులలో కూడా ఆ ప్రయోగాలు చేయడానికి సిద్దమయ్యారు.

మగవారు కూడా పిల్లల్ని కనవచ్చని ఆ నివేదికలు తెలిపాయి.త్వరలో చైనాలో మగవారిపై ఆ ప్రయోగాలు అనేవి ముమ్మరం చేయనున్నారు.

అందులో కచ్చితంగా విజయం సాధిస్తామని చెబుతున్నారు.చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలలో మొదటగా ఆడ ఎలుకలను ఎంపిక చేశారు.

ఆడ ఎలుకలలో గర్బ సించిని తొలగించారు.ఆ తర్వాత మగ ఎలుకకు ఆ గర్భసంచిని పెట్టారు.

షాంఘైలోని నావల్ మెడికల్ యూనివర్శిటీ జరిపిన ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో జరిగింది.దీనికి ర్యాట్ మోడల్ 6 అని నామకరణం చేశారు.

ఈ ప్రయోగంలో గర్భం దాల్చిన మగ ఎలుక మొత్తం 10 పిల్లలకు జన్మనిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube