వైరల్ వీడియో: నదిలో ఎంజాయ్ చేస్తున్న గజరాజుల ఫ్యామిలీ..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video-gajraj Family Enjoying In The River ,viral Video, Viral Latest, Elep-TeluguStop.com

ఇందులో ఎక్కువగా సింహాలు చేసే పోరాటాలు, కుక్క పిల్లలు చేసే ఫన్నీ వీడియోలు, ఏనుగులు సరదాగా ఆడుకునే వీడియోలు వైరల్ అవుతూ ఉండటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.సాధారణంగా ఏనుగులు కాలువలలో, బురదలో ఆడుకుంటూ ఉంటున్న వీడియోలను మనం చూసే ఉంటాం.

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో హద్దుల్లేని అల్లరి చేస్తూ పిల్ల ఏనుగులు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా కనపడతాయి.ప్రతి క్షణం ఏనుగు తల్లి వాటిని ఒక కంట పెట్టుకొని వాటిని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

అయితే తాజాగా ఒక తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, అలాగే ఆ పిల్ల ఏనుగు నీటిలో సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక పిల్ల ఏనుగు తన తల్లి ఏనుగు, తండ్రి ఏనుగులతో కలిసి ఒక నది ఒడ్డున కు వెళ్ళింది.దీనితో అక్కడ ఉన్న నీటిలో దూకి ఆ పిల్ల ఏనుగు ఆడుకోవాలని ప్రయత్నించగా, అంతలో తల్లి ఏనుగు మాత్రం నదిలోకి ముందుగా వెళ్లడానికి ఇష్టపడకుండా, మొదట తల్లి ఏనుగు, మరో ఏనుగు నదిలోకి దూకి ఆ పిల్ల ఏనుగు ఆడుకునేందుకు ఆ ప్రాంతం అంతా సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించిన అనంతరం పిల్ల ఏనుగును నీటిలోకి తీసుకొని వెళ్లి అట ఆడించింది.ఇందుకు సంబందించిన వీడియోను ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “తల్లి ఏనుగులు ఎప్పుడు తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటాయి.

వారి చుట్టు ఉన్న వాతావరణం సురక్షితంగా ఉందని నమ్మితేనే పిల్ల ఏనుగులను ఒంటరిగా ఆడుకోనిస్తాయి.” అనే క్యాప్షన్ ను జత చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిన్న ఏనుగు నీటిలో ఆడుతున్న వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube