పవన్ ఓల్డ్ ఫోటోను వీర లెవల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్ !

మెగాస్టార్ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈయన సినిమాలంటే ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.

 Pawan Kalyan Old Pic Viral In Social Media, Pawan Kalyan, Old Pic, Viral Photo-TeluguStop.com

కానీ రాజకీయాలలోకి వచ్చాక పవన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదు.

మళ్ళీ ఈ మధ్యనే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో వెండితెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.మరొకసారి పవన్ తన స్టామినా నిరూపించుకున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.అంతేకాదు ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.అయితే పవన్ ఈ సినిమా తో పాటు ”అయ్యప్పనుమ్ కోషియం” అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.

Telugu Pawan Kalyan-Movie

అయితే తాజాగా పవన్ ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అప్పట్లో చాలా స్టైలిష్ గా వింటేజ్ లుక్ తో కనిపించడంతో పవన్ అభిమానులు ఆ పిక్ ను సోషల్ మీడియాలో వీర లెవల్ లో వైరల్ చేస్తున్నారు.ఈ ఫోటో నిన్నటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంతేకాదు పవన్ ఫ్యాన్స్ ఆ ఫోటోను ఎడిట్ కూడా చేసుకుంటూ షేర్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube