తృటిలో తప్పించుకున్న విశాల్... యాక్షన్ సీన్ లో ప్రమాదం

మన స్టార్ హీరోలు యాక్షన్ సీక్వెన్స్ చేసే సమయంలో ఒక్కోసారి రిస్కీ షాట్స్ చేస్తూ ప్రమాదాలకి గురవుతారు.ఇది చాలా కామన్ గా జరుగుతుంది.

 Hero Vishal Injured In Fight Sequence, Tollywood, Rfc, Kollywood, South Heroes,-TeluguStop.com

కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటారు.కొంత మంది హీరోలు షూటింగ్ సమయంలోనే ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇతర నటులు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.కన్నడ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు విలన్స్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మన తెలుగు స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, బన్నీ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తూ ఉంటారు.ఇలాంటి సందర్భంలో ప్రమాదాల బారిన పడ్డారు.

తాజాగా హీరో విశాల్ కూడా అలాగే ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.అయితే తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Telugu Sequence, Vishal, Kollywood, Heroes, Tollywood-Movie

శరవణన్ దర్శకత్వంలో విశాల్ కొత్త సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది.ఈ షూట్ లో యాక్షన్ డైరెక్టర్ రవివర్మ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.విలన్ గ్యాంగ్ తో ఫైట్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళు గాజు సీసాలు విశాల్ మీదకి విసురుతారు.ఇందులో నిజమైన సీసాలనే ఉపయోగించిన ఫైటర్స్ వాటిని విశాల్ కి తగలకుండా సైడ్ కి విసరాల్సి ఉంటుంది.

ఉంటుంది.అయితే ఓ ఫైటర్ అనుకోకుండా నిజంగానే సీసాతో విశాల్ తలపై కొట్టాడు.

అయితే దెబ్బ తగిలిన తర్వాత కూడా గ్యాప్ తీసుకోకుండా విశాల్ ఆ సీక్వెన్స్ ని పూర్తి చేయడం విశేషం.ఇదిలా ఉంటే డీ సన్నివేశానికి సంబందించిన విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విశాల్ కూడా దీనిపై స్పందించారు.ఆ ఫైటర్ ని ఇందులో ఎలాంటి తప్పు లేదని, టైమింగ్ మిస్ అవ్వడం వలన అలా జరిగిందని పేర్కొన్నారు.

అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube