క‌డుపు అల్సర్ వేధిస్తుందా? పుదీనాతో నివారించుకోండిలా!

క‌డుపులో ఆమ్ల పరిమాణం పెరిగినా, తగ్గినా పేగుల్లో ఇబ్బందులు ఏర్ప‌డి పుండ్లు ప‌డ‌తాయి.దీనినే క‌డుపు అల్స‌ర్ అని అంటారు.

 Mint Leaves, Reduce Stomach Ulcer, Mint Leaves For Health, Stomach Ulcer, Benef-TeluguStop.com

అల్స‌ర్ వ‌ల్ల క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి, మంట‌, ఆక‌లి లేక‌పోవ‌డం, తేన్పులు, త‌ర‌చూ వాంతులు కావ‌డం ఏం తిన్నా గ్యాస్‌, ర‌క్త హీన‌త‌, ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గ‌డం ఇలా అనేక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.ఈ ల‌క్ష‌ణాలు నిర్ల‌క్ష్యం చేస్తూ అలాగే ఉంటే.

అల్స‌ర్ మ‌రింత తీవ్ర త‌రంగా మారిపోతుంది.అందుకే అల్స‌ర్‌ను ఎంత త్వ‌ర‌గా త‌గ్గించుకుంటే.

అంత ప్రశాంతంగా ఉంటుంది.

Telugu Benefits Mint, Tips, Latest, Mint, Reducestomach, Stomach Ulcer-Telugu He

ఇక అల్స‌ర్‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది యాంటిబయాటిక్స్ ను ఉపయోగిస్తుంటారు.అయితే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ అల్స‌ర్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాల‌ు  అల్స‌ర్‌ను సూప‌ర్ ఫాస్ట్‌గా నివారించ‌గ‌ల‌వు.

అలాంటి ఫుడ్స్‌లో పుదీనా కూడా ఒక‌టి.అవును, అల్స‌ర్‌తో బాధప‌డే వారు గుప్పెడు పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి బాగా మ‌రిగించి.

ఆ త‌ర్వాత వ‌డ‌బోసుకుని తీసుకోవాలి.లేదా పుదీనా ఆకుల‌ను డైరెక్ట్‌గా న‌మిలి మింగేయాలి.

ఇలా ఎలా చేసినా.పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అల్సర్ వల్ల ఏర్పడే మంట, నొప్పిని నిరోధించ‌డంతో పాటు క్ర‌మంగా పుండ్ల‌ను కూడా త‌గ్గించేస్తాయి.

అలాగే స్టమక్ అల్సర్ తో బాధపడేవారికి పెరుగు అద్భుతంగా సహాయపడుతుంది.అందువ‌ల్ల‌ ప్ర‌తి రోజు ఒక క‌ప్పు పెరుగులో ఒక స్పూన్ స్వ‌చ్ఛమైన తేనె క‌లుపుకుని తీసుకోవాలి.

ఇలా చేస్తే అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియా నాశ‌నం అవుతుంది.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

Telugu Benefits Mint, Tips, Latest, Mint, Reducestomach, Stomach Ulcer-Telugu He

ఇక క‌ల‌బంద కూడా క‌డుపు అల్స‌ర్‌ను నివారించ‌గ‌ల‌దు.క‌ల‌బంద ఆకు నుంచి రెండు స్పూన్ల జెల్ తీసుకుని ఉద‌యాన్నే సేవించాలి.ఇలా చేసినా కూడా అల్స‌ర్ త్వ‌ర‌గా త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు క‌ల‌బందను ఇలా తీసుకుంటే శ‌రీరంలో అన‌వ‌స‌ర‌మైన కొవ్వు సైతం క‌రిగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube