వైరల్: ఫెవికాల్ కంపెనీ టాలెంట్ మామూలుగా లేదుగా..!

ఒక వస్తువు మార్కెట్ లోకి రావాలంటే ఎన్నో రకాల ఎత్తుగడలు వేసి ప్రజలకు చేరువయ్యేలా ఆలోచనలు చేస్తుంటారు కంపెనీ దారులు.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న డిజిటల్ హంగులను ఉపయోగించి కొత్త వస్తువులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నారు.

 Viral Fevicol Company Gets Appreciated For Its Marketing Creativity , Time , Ill-TeluguStop.com

మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి మానవ సంబంధాలను పెనవేసుకుంటూ ఫెవికాల్ సంస్థ ముందుకు సాగుతోంది.ఇందులో భాగంగానే ఫెవికాల్ అడ్వర్టైస్మెంట్ కూడా హృదయానికి అతుక్కునేలా రూపొందించడంలో సంస్థ ముందు ఉంటుంది.

ఇకపోతే తాజాగా ఫెవికాల్ సంస్థ చేసిన ఓ అడ్వటైజ్మెంట్ తో నెటిజన్ల నుండి పెద్దఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.ఈ దెబ్బతో ఫెవికాల్ సంస్థ మార్కెటింగ్ క్రియేటివిటీ సత్తా ఏంటో చాటుకుంది.

మరికొందరైతే ఈ క్రియేటివిటీ పై సరదాగా కామెంట్ చేస్తూ ఫెవికాల్ అడ్వర్టైస్మెంట్ ను ట్రెండింగ్ గా మార్చేశారు.ఇక ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళ్తే.

తాజాగా యూరో కప్ లో భాగంగా కోకో కోలా కంపెనీ కి సంబంధించిన రెండు కొక్ బాటిల్స్ ను స్టార్ ఆటగాడు పక్కన పెట్టి నీళ్లు తాగండి అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన కారణంగా దాంతో ఏకంగా ఒక్కరోజులో 29 వేల కోట్ల నష్టం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సన్నివేశాన్ని తాజాగా ఫెవికాల్ సంస్థ వారికి అనుకూలంగా మార్చుకుంది.అది ఎలా అంటే.ప్రెస్ కాన్ఫరెన్స్ లో టేబుల్ పై ఉన్న కోక్ బాటిల్స్ కు బదులు రెండు ఫెవికాల్ బాటిల్స్ ను పెట్టి “దీన్ని ఎవరు జరపలేరు.

విటి విలువ ఎప్పటికీ పడిపోదు” అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక అంతే ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ నిజంగా ఫెవికాల్ సంస్థ యొక్క క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube