పప్పూ.. తుప్పు ! అయ్య బాబోయ్ 'కొడాలి' కామెంట్స్ ?

నారా లోకేష్ చంద్రబాబు పేరు చెబితేనే తీవ్రస్థాయిలో మండిపడుతూ, తన నోటికి పని చెప్తూ ఉంటారు ఏపీ మంత్రి కొడాలి నాని.పరుష పదజాలంతో ఈ ఇద్దరు పైన తిట్లదండకం అందుకుంటూ, నాని చేసే హంగామా అంతా ఇంతా కాదు.

 Kodali Nani Sensational Comments On Lokesh Chandrababu, Kodali Nani, Lokesh, Cha-TeluguStop.com

ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు లోకేష్ పై కామెంట్స్ చేసిన వెంటనే ,నాని రియాక్ట్ అవుతుంటారు.ఇక ఆయన చేసే కామెంట్స్ ను ఎంజాయ్ చేసే వాళ్ళు మీడియా,  సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండడంతో నాని ప్రసంగాలు ఎక్కువ హైలెట్ అవుతుంటాయి.

తాజాగా లోకేష్ చంద్రబాబు పై నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  నారా లోకేష్ పిచ్చి కుక్కల అరుస్తున్నాడు అని, పప్పు తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు అంటూ ఫైర్ అయ్యారు.

 తండ్రి కొడుకులు ఇద్దరు ఇంట్లో కూర్చుని జూమ్ లో కాలక్షేపం చేస్తున్నారు అంటూ నాని మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు పెట్టిన బకాయిలు అన్నిటిని తమ ప్రభుత్వం చెల్లించింది అని,  రైతులకు బాబు పెట్టిన నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లించాలని, రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ రైతు బాంధవుడు అని కొనియాడారు.21 రోజుల లోపు దాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు.కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రైతులకు చెల్లిస్తున్నామన్నారు.కేంద్రానికి లేఖ రాయాలి అంటే చంద్రబాబు ఎక్కడ లేని భయం అని , ఊక కి, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

Telugu Chandrababu, Kodali Nani, Lokesh, Tdp, Ysrcp-Telugu Political News

 లోకేష్ ను అచ్చోసిన ఆంబోతులా వదిలారని,  చంద్రబాబు లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని నాని హెచ్చరించారు.చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని,  రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదని చట్టం తీసుకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మీడియా సమావేశం మొత్తం లోకేష్ ,చంద్రబాబు, టిడిపి ప్రభుత్వ విధానాలనే టార్గెట్ చేసుకుని నాని విమర్శలు కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube