అభిమాని చేసిన పనికి షాకైన రష్మిక.. అసలేమైందంటే..?

సాధారణంగా కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను, హీరోయిన్లను విపరీతంగా అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 Rashmika Mandanna Shocks Over Fan Art By Hand And Legs,latest Social Media-TeluguStop.com

అయితే తాజాగా ఒక అభిమాని రష్మిక షాకయ్యే పని చేశారు.బాలీవుడ్ లో రష్మిక ఒక్క సినిమా చేయకపోయినా అక్కడ కూడా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.

Telugu Hand Legs, Fans-Movie

నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను సైతం సొంతం చేసుకున్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు తన ఫాలోవర్లకు సినిమాలకు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తుంటారు.తాజాగా రష్మిక అభిమాని ఒకరు రష్మిక బొమ్మను పేపర్ పై గీశాడు.రష్మిక బొమ్మను గీయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకపోయిన ఆ అబ్బాయి ఒకే సమయంలో రెండు చేతులు, రెండు కాళ్లతో ఏకంగా నాలుగు బొమ్మలను గీసేయడం గమనార్హం.

రష్మికపై ఉన్న అభిమానానికి నెటిజన్ ఈ విధంగా చాటుకున్నారు.

నెటిజన్ గీసిన బొమ్మల గురించి చెబుతూ ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని అభిమాని చేసిన పని అభిమానానికి పరాకాష్ట అని రష్మిక చెప్పుకొచ్చారు.తనపై ఊహించని స్థాయిలో అభిమానాన్ని చూపిన అభిమానికి రష్మిక థ్యాంక్స్ చెప్పారు.

ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలతో బిజీ అవుతున్నారు.

Telugu Hand Legs, Fans-Movie

బాలీవుడ్ లో ఇప్పటికే రష్మిక నటిస్తుండగా మరో సినిమా కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది.రష్మిక బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం.రష్మిక తెలుగులో ప్రస్తుతం పుష్ప రెండు భాగాలలో నటిస్తుండగా, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube