మాజీ మంత్రి దేవినేని ఉమా పై మరో కేసు నమోదు..!!

గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రులుగా పనిచేసిన వారిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో కేసులు వెంటాడుతున్నయి.కొల్లు రవీంద్ర, అప్పట్లో ప్రభుత్వ విప్ గా పనిచేసిన చింతమనేని ప్రభాకర్, అచ్చన్నాయుడు వంటి వారిని కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.

 Case File Against Devineni Uma Tdp, Devineni Uma, Ap Poltics ,tdp , Ys Jagan , C-TeluguStop.com

ఇదే రీతిలో అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమా పై కూడా కేసులు నమోదయ్యాయి.ముఖ్యమంత్రి జగన్ మాటలను వక్రీకరించారని ఆయనపై ఇటీవల Cid కేసు నమోదు చేయటం తెలిసిందే.

పరిస్థితి ఇలా ఉండగా మరో సారి ఆయనపై కేసు నమోదైంది.

మేటర్ లోకి వెళ్తే ఈ నెల 16 వ తారీఖున మైలవరంలో ఆ పార్టీకి చెందిన ఆందోళనలు నిర్వహించటం జరిగింది.

రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయడం జరిగింది.ఆ తర్వాత తహసీల్దార్ కు వినతిపత్రం కూడా సమర్పించారు.

అయితే కరోనా నిబంధనలు పాటించకుండా ఆందోళనలు నిర్వహించారని ఆందోళనలు చేసిన దేవినేని ఉమా పై అదేరీతిలో కొంతమంది టీడీపీ నాయకుల పై సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube