మండ‌లిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. టీడీపీకి మ‌రో దెబ్బ‌..?

ఏపీలో వైసీపీకి అన్ని విభాగాల్లోనూ పూర్తి మెజార్టీ ఉంది.కానీ ఒక్క మండ‌లిలో మాత్రం టీడీపీకి సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ చ‌ట్టం చేసినా అక్క‌డ చిక్కులు ఎదుర‌వుతున్నాయి.

 Changing Alliances In The Council .. Another Blow To Tdp  , Ycp,  Tdp,  Politics-TeluguStop.com

అయితే ఇప్పుడున్న తాజా ప‌రిణామాల‌తో వైసీపీకి క‌లిసొస్తోంది.ఎందుకంటే ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్సీల ప‌ద‌వికాలం ముగుస్తోంది.

దీంతో ఆ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరుతున్నాయి. టీడీపీ నుంచి ఉన్న ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగియ‌డం వైసీపీకి పెద్ద లాభంగా మారింది.

టీడీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఏడుగురు స‌భ్యులు ఈ రోజు ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నారు.వీరితో పాటే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో మాజీ అవుతున్నారు.

అలాగే రీసెంట్‌గా వైసీపీ నుంచి గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎంపికైన నలుగురు నామినేటెడ్ ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో చేరుతున్నారు.ఈ ప‌రిణామాల‌తో వైసీపీ బ‌లం బాగా పెరుగుతోంది.ఇక టీడీపీ సంఖ్యాబ‌లం 22 నుంచి 15కు ప‌డిపోతోంది.

Telugu Andhra Cm Jagan, Ap Ycp, Ap Cm, Ap Poltics, Chandrababu, Tdp Mlc, Ysrcp M

ఇదే టైమ్‌లో వైసీపీ బ‌లం ఏకంగా 17 నుంచి 21కి చేరింది.దీంతో పాటే ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల‌ను జ‌గ‌న్ ప్ర‌భ‌త్వం త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది.అదే జ‌రిగితే ఇక వైసీపీకి మండ‌లిలో ఎదురనేదే ఉండ‌దు.

అంటే ఇక్క‌డ కూడా టీడీపీకి చిక్కులు త‌ప్ప‌వ‌న్నమాట‌.ఇదే జ‌రిగితే గ‌తంలో టీడీపీ వ్య‌తిరేకించిన మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటే ఇంగ్లీషు మీడియం బిల్లులు అప్ప‌ట్లో వీగిపోయాయి.

ఇక ఈ కార‌ణంతో అప్ప‌ట్లో జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి అప్ప‌ట్లోపంపించారు.కానీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

మ‌రి ఇప్పుడు జ‌గ‌న్‌కు బ‌లం పెర‌గ‌డంతో దాన్ని కంటిన్యూ చేస్తారా లేక ర‌ద్దుకే మొగ్గు చూపుతారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube