వైరల్: పక్షికి తల్లిగా మారిన శునకం..!

సాధారణంగా జంతువులకు కూడా ప్రేమ, జాలి, దయ ఉంటాయని మనం చూస్తూనే ఉంటాం.కొంతమంది ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లులలో ఈ ఎమోషన్స్ మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral A Dog Behaves As Mother To A Bird In Australia Queensland , Dog,behaves, B-TeluguStop.com

ఒకే జాతికి చెందిన రెండు జంతువులకు సంబంధించి వీడియోలు, ఫోటోలు వాటి స్నేహం గురించి మనం కథనాలను వింటూనే ఉంటాం.ఒక ఇంట్లో ఉండే కుక్క ఒక పక్షి ఇద్దరు స్నేహితులుగా మారి, అవి ఆడుకునే వీడియోలను మనం చూసే ఉంటాం.

అయితే ప్రస్తుతం ఒక పక్షికి తల్లిగా మారి మొత్తం బిడ్డ లాగా చూసుకోవడం, అలాగే సొంత తల్లి లాగా పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది.మరోవైపు పక్షి పరిస్థితి కూడా అంతే అచ్చం కుక్క లాగే ప్రవర్తించడంతో పాటు మొరగడం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వాస్తవానికి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.?! ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌ లాండ్‌ లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ లాండ్‌ కు చెందిన ఒక దంపతులకు గత సంవత్సరం అనారోగ్య కారణంగా చివరి దశలో ఉన్న ఒక పక్షిని చేరదీసి వారే దాని ఆలనా పాలనా చూడడం మొదలుపెట్టారు.

ఆ పక్షికి మోలీ అనే పేరుతో నామకరణం చేశారు.అనారోగ్యంతో ఉన్న ఆ పక్షి, వారి పెంపుడు కుక్క ఆయన పెగ్గీ సహకారంతోనే త్వరగానే కోలుకొని ఎప్పటిలాగా స్వేచ్ఛగా ఉంది.

ఒకదానితో ఒకటి కలిసి ఉండటంతో ఆ పక్షి పూర్తిగా మారిపోయి కుక్కలాగా ప్రవర్తించడం, మొరగటం మొదలు పెట్టేసింది.మొదట్లో అది కుక్క అరుపులు అని భావించారు.

Telugu Australia, Bird, Dogbird, Mother, Netizens, Queenland, Queensland, Dog-La

కానీ, ఆ అరుపులు పక్షివి అని తెలుసుకుని వారు ఒక్కసారిగా లోనయ్యారు.కేవలం పక్షిలోనే మార్పులు కాకుండా కుక్కలు కూడా తదితర మార్పులు వచ్చాయి.అవి ఏమిటంటే.మొదటిలో ఆ కుక్కకు పక్షులు అంటే చాలా భయం ఉండేదట, కానీ మోలీ పరిచయమైన అనంతరం ఆ భయం మొత్తం పోయిందని ఆ దంపతులు పేర్కొంటున్నారు.

ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం విషయానికి వస్తే పెగ్గీ.మోలీని తన బిడ్డ లాగా భావించడం తో పాటు పిల్లలకు పాలు ఇచ్చినట్లు కూడా పాలు ఇవ్వడం చేస్తుంది.

ఇందుకు గల ముఖ్య కారణం విషయానికి వస్తే ఈ శరీరంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రముఖ డాక్టర్ తెలియజేశారట.ఏది ఏమైనా కానీ ఈ తల్లి బిడ్డల ప్రేమ నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube