జర్నలిస్ట్ పై బిడెన్ ఆగ్రహం...ఒక్కసారిగా షాక్ అయిన మీడియా..ఇంతకీ ఏం జరిగింది...!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ తో మీడియా సమావేశం జరుగుతోంది.మీడియా వారు అడుగుతున్న ప్రశ్నలకు బిడెన్ సమాధానాలు ఇస్తున్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో బిడెన్ సమావేశం అయిన విషయంపై ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానాలు చెప్పి బిడెన్ వెళ్తూ ఉన్న క్రమంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Biden Angry At Journalist Shocking Media At Once What Happened So Far, America P-TeluguStop.com

ఎంతో సౌమ్యంగా ఉండే బిడెన్ కు ఫైర్ అవ్వడంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు.అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు, కొంపదీసి బిడెన్ మీదకు ట్రంప్ పూనాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయట.

ఇంతకీ బిడెన్ కు అంత కోపం తెప్పించిన ప్రశ్న ఏంటంటే.

రష్యా అధ్యక్షుడితో బిడెన్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఆ తరువాత మీడియా సమావేశం కూడా జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న సిఎన్ఎన్ వైట్ హౌస్ కరస్పాండెంట్ కైట్లాన్ బిడెన్ ను ప్రశ్నలతో ముంచెత్తారు.మీ భేటీ చాలా బాగుంది, అయితే ఈ భేటీ తరువాత పుతిన్ అమెరికాపై తన తీరును మార్చుకుంటారని మీరు భావిస్తున్నారా, అసలు పుతిన్ మానవ హక్కుల ఉల్లంఘన , సైబర్ దాడుల పై పెదవి విప్పలేదని అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మకమైన చర్చ అని ఎలా చెప్పగలరు అంటూ ఆమె ప్రశ్నించారు.

దాంతో కోపంతో ఊగిపోయిన బిడెన్ వెళ్ళిపోతూ ఆమె వైపుగా వచ్చారు.

Telugu America, Biden, Agnaist, Jurnolist, Puthin, Russia, Trump-Telugu NRI

పుతిన్ తీరు మారుతుందని నేను అనుకోవడం లేదు, నేను నమ్ముతున్నాను అని చెప్పానా, నేను ఏ విషయాన్ని నమ్మను, నేను చెప్పేది నిజం , మీకు అర్థం అయినా కాకపోయినా నేను చేసేది ఏమి లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.నేను ఎప్పుడూ ఆలోచించేది అమెరికా భవిష్యత్తు, నా ప్రజల అభివృద్ధి అంతే అంటూ సమాధానం ఇచ్చారు.అయితే కోపంగా ఆమెతో మాట్లాడినందుకు బిడెన్ ఆమెకు క్షమాపణలు తెలిపారు.

బిడెన్ ఇప్పటి వరకూ ఇలా ఒకరిపై అందులోనూ మీడియా పై ఫైర్ అవ్వలేదని ఇదే మొదటి సారని ఈ ఘటన అందరిలో ఆశ్చర్యాన్ని నింపిందిని అంటోంది అమెరికా మీడియా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube