ఆ కామెంట్లు తట్టుకోలేకపోయా.. హీరోయిన్ భావోద్వేగం!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏదో ఒక విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చిన్న హీరోయిన్స్ కెరీర్ మొదట్లోనే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

 Cant Could Not Tolerate Those Comments Zareen Khan , Comments, Katrina Kaif, Bol-TeluguStop.com

ఇప్పటికీ స్టార్ హీరోయిన్స్ కూడా వ్యక్తిగత విషయాలలో కామెంట్స్ ఎదుర్కొంటుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తనకు ఎదురైన కామెంట్ లను తట్టుకోలేకపోయింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు

బాలీవుడ్ నటి జరీనా ఖాన్.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పోలికలతో ఉన్న హీరోయిన్ 2010 లో సల్మాన్ ఖాన్ నటించిన వీర్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా అంతా సక్సెస్ ఇవ్వలేదు.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఇక చూడటానికి అచ్చం కత్రినా లా ఉండే ఈ హీరోయిన్ ను కెరీర్ మొదట్లో చూసినవారంతా కత్రినా కైఫ్ అనే అనుకున్నారు.కానీ ఆ తర్వాత కత్రినాతో పోలికలతో ఉన్న మరో హీరోయిన్ అని తేలింది.

దీనివల్ల ఆమె గతంలో చాలా ఫీల్ కూడా అయింది.ఇదిలా ఉంటే ఈమెకు ఎదురైన కామెంట్లు కూడా చాలా బాధ పెట్టాయట

Telugu Bollywood, Katrina Kaif, React, Veer, Zareen Khan-Movie

మొదటి సినిమా లో నటించిన జరీనా ఖాన్ కు కొన్ని కామెంట్స్ ఎదురయ్యాయని, దానివల్ల చాలా బాధపడ్డానని తెలిపింది.తను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టిందట.అప్పట్లో ప్రతి ఒక్క విషయాలపై ఇప్పుడు యువతకు ఉన్న అవగాహన అప్పట్లో లేదని తెలిపింది.

దాంతో ఇండస్ట్రీలో ప్రతి విషయం తనకు కొత్తగానే అనిపించిందట.సెట్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజే కెమెరా ఎక్కడ ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.

Telugu Bollywood, Katrina Kaif, React, Veer, Zareen Khan-Movie

ఇక సినిమాల పట్ల తనకు అవగాహన లేదని అనుభవం ఉన్న వ్యక్తులతో తాను మొదటి సినిమా చేశానని తెలిపింది.అలా ఎవరు ఏం చెప్పినా వినేదట.వీర్ షూటింగ్ సమయంలో తను బరువు పెరగమని చెప్పటంతో అలాగే బరువు పెరిగిందట.అలా కెమెరా ముందు నటించడంతో సినిమా విడుదల తర్వాత తన శరీర బరువు గురించి బాగా కామెంట్లు చేశారట.

అప్పట్లో తల్లి శరీర బరువు ఓ జాతీయ సమస్యల మారిందట.ఇక వాటిని పట్టించుకోవడం పక్కన పెట్టేసిందట.ఏవి శాశ్వతం కావని ఈ విషయాలన్నీ ఇండస్ట్రీ నేర్పించిందని తెలిపింది.సినిమా సినిమా కి మధ్యలో మార్పులు ఉంటాయని కాబట్టి ఏది దగ్గరగా తీసుకోకూడదని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube