ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులెవరో గుర్తు పట్టారా...?

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, తదితర భాషలలో దాదాపుగా 40 వేల పాటలకు పైగా పాడి తన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ గానగంధర్వుడు “ఎస్పీ బాల సుబ్రమణ్యం” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 100 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

 Thaman And Sp Balasubramanian Photos Viral, S.s.thaman, Sp Balasubramanian, Telu-TeluguStop.com

కానీ అనుకోకుండా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శ్వాస కోస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ గత ఏడాది మృతి చెందాడు.దీంతో ఒక్కసారిగా గాన మీజిక్ ఇండస్ట్రీ మూగబోయింది.

ఎంతో అనుభవం ఉన్నటువంటి లెజెండరీ గాయకుడి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు.

అయితే ఇటీవలే ఎస్పీ బాల సుబ్రమణ్యం మృతి చెంది సంవత్సరం కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.

కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిన్నప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశాడు.

అలాగే 1996వ సంవత్సరంలో లాస్ ఏంజిల్స్ వెళుతున్నప్పుడు ఎయిర్ పోర్టులో లెజెండరీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారితో కలిసి తీసుకున్నానని తెలిపాడు.దీంతో చిన్నప్పుడు ఎస్.ఎస్ థమన్ చాలా బొద్దుగా కనిపిస్తున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సర్కారు వారి పాట” అనే చిత్రానికి స్వరాలను సమకూరుస్తున్నాడు.అలాగే నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను  కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అఖండ” చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

దీంతో ఎస్.ఎస్ థమన్ ప్రస్తుతం తమన్ టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube