పిల్లలపై ఎటాక్ అవుతున్న బ్లాక్ ఫంగస్.. !!

మాయదారి కరోనా వైరస్‌ను ఎవరి స్వార్ధం కోసం సృష్టించారో తెలియదు గానీ ప్రపంచాన్నే అల్లకల్లోలంగా మార్చేసింది.చివరికి శ్మశానాల్లో కూడా కాసింత చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే దుస్దితిని తెచ్చింది.

 Eyes Of Three Children Infected With Black Fungus Removed In Mumbai,mumbai, Blac-TeluguStop.com

ఇప్పటి వరకు ప్రకృతి సృష్టించిన విలయాలకు కూడా ఇంతలా ప్రజలు అల్లాడిపోలేదు.కానీ కంటికి కనిపించని ఈ వైరస్ వల్ల ఎందరో జీవితాలే చెల్లాచెదురు అయ్యాయి.

ఇకపోతే ఈ కరోనా సెకండ్ వేవ్ కూడా కాస్త నెమ్మదిస్తున్న సమయంలో బ్లాక్ ఫంగస్ అలజడి సృష్టిస్తు, తన ఉనికిని చాటుతుంది.దీని తాకిడికి కరోనా నుండి కోలుకున్న వారు ఆందోళన చెందే పరిస్దితులు నెలకొన్నాయి.

అయితే ఈ బ్లాక్ ఫంగస్ చిన్న పిల్లలను కూడా వదలడం లేదట.తాజాగా మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో బ్లాక్ ఫంగ‌స్ సోకిన ముగ్గురు పిల్ల‌ల కళ్లను వైద్యులు శ‌స్త్ర‌చికిత్స ద్వారా తొల‌గించారట.

క‌రోనా బారిన పడి కోలుకున్న‌ 4, 6, 14 ఏళ్ల వ‌య‌సున్న ముగ్గురు పిల్ల‌ల‌కు ముకోర్మైకోసిస్ వ్యాధి సోకగా, వీరికి ఆప‌రేష‌న్ నిర్వ‌హించి బ్లాక్ ఫంగ‌స్ సోకిన ఒక్కో క‌నుగుడ్డును తొల‌గించినట్లు వైద్యులు ప్రకటించారు.నిజంగా ఎంత దురదృష్టకరమైన ఘటన ఇది.చిన్న వయస్సులోనే ఒక చూపు కోల్పోవడం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube