ప్రగతిభవన్ చుట్టూ అష్ట దిగ్బంధనం.. ఎందుకింత భయం సార్ అంటున్న జనం.. ?

తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తెగ హీట్ పుట్టిస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక ఈటలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు.

 Iron Fence Around Pragathi Bhavan, Iron Fence, Pragathi Bhavan, Cm Kcr, Etela Ra-TeluguStop.com

ఇకపోతే ఈటల దెబ్బకు కేసీఆర్ చూపు వరంగల్ నియోజక వర్గంతో పాటుగా, హూజురాబాద్ పై పడింది.దీంతో తెగనిధులను విడుదల చేస్తూ తప్పని సరిగా అభివృద్ధి జరగాలని హుకూంలు జారీ చేశారట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ చుట్టూ ఇనుప కంచెతో అష్ట దిగ్బంధనం చేస్తున్నారట.రానున్న రోజుల్లో ప్రగతి భవన్ ముందు నిరసనలు, ధర్నాలను నివారించేందుకు పోలీసులు ఈ తరహా చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లుగా సమాచారం.

ఇక నుండి సామాన్యులెవరూ ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కాని రీతిలో ఈ వలయం తయారవుతున్నదట.ఈ విచిత్రాన్ని చూస్తున్న తెలంగాణ ప్రజల నోళ్లలో అచ్చం నిజాం పాలనను తలపించేలా పరిస్దితులు నెలకొంటున్నాయని, కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ అధికార దాహం ఇంకెంత కాలం ఉంటుందో, పెద్ద దొరకు ఇంత భయం ఎందుకు వస్తుందో అని గుసగుసలు కూడా మొదలయ్యాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube