జాగ్రత్త : ఆంటీలు బాగున్నారని కక్కుర్తిపడి వీడియో కాల్ చేస్తే దూల తీరుద్ది...

ఈ మధ్యకాలంలో కొందరు అడ్డదారుల్లో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా కొంతమంది యువతులు, ఆంటీలు వీడియో కాల్స్ పేరుతో ఆన్ లైన్ వ్యభిచారం నిర్వహిస్తూ అమాయకుల నుంచి అందినంత గుంజుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Online Call Girls Blackmailing For Money In Rajasthan, Rajasthan, Crime News, On-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో స్థానిక రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలలో ఎక్కువగా డబ్బు కోసం బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న కేసులు నమోదవుతున్నాయి.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఉంచారు.

ఇదివరకే ఈ బ్లాక్ మెయిలింగ్ విషయంపై నమోదైన కేసుల విచారణలో పోలీసులు పలు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు.ఇందులో ముఖ్యంగా కొందరు యువతులు అడ్డదారుల్లో డబ్బులు సులభంగా సంపాదించాలని ఆన్ లైన్ వ్యభిచారం పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను సృష్టించి వీడియో కాల్ కి గంటకి 500 రూపాయలు మరియు  న్యూడ్ వీడియో చాట్ కి గంటకి 300 రూపాయలు, న్యూడ్ ఫోటోలకి 150 రూపాయలు ఇలా రేట్లను ఫిక్స్ చేసి ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

Telugu Rajasthan-Movie

దీంతో కొందరు యువకులు ఈ యువతల మాయలో పడి వీడియో కాల్స్ చేయడం, తమ న్యూడ్ ఫోటోలను పంపించడం వంటివి చేశారు.దీంతో ఇదే అదునుగా చేసుకున్న యువతులు యువకుల ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని దాంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలను కలుస్తాయని కాబట్టి ఇలా చేయకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారు.దీంతో కొంతమంది యువకులు తమ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి లక్షల రూపాయలను సమర్పించుకున్నారు.అయినప్పటికీ ఈ యువతుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి.దీంతో కొందరు యువకులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపుగా 70 మందికి పైగా యువతులు, ఆంటీలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దీంతో ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ వ్యభిచారం పేరుతో కొంతమంది యువతులు వీడియో కాల్, నగ్న ఫోటోలు వంటివి పంపిస్తూ రెచ్చగొడుతున్నారని కాబట్టి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో గుర్తు తెలియని వారికి తమ ఫోటోలను మరియు ఫోన్ నెంబర్లు లేదా ఇతర బ్యాంకు అకౌంట్ వివరాలు వంటివి షేర్ చేయవద్దని కూడా హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube