ఈట‌ల దారిలోనే క‌డియం.. ఎమ్మెల్సీ ఇవ్వ‌కుంటే అంతేనా..?

తెలంగాణ రాజ‌కీయాలు ఈట‌ల వ్య‌వ‌హారంతో ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో మ‌లుపు తిరిగాయి.ఈట‌ల లాంటి కీల‌క ఉద్య‌మ నేత‌లే టీఆర్ ఎస్‌ను వీడ‌టంతో అందులో ఉన్న అనేక మంది అసంతృప్తుల‌కు ఇప్ప‌డు దారి దొరికిన‌ట్ట‌యింది.

 Kadiyam Srihari In The Way Of Etela Rajender What If Mlc Is Not Given, Kadiyam,-TeluguStop.com

ఇక ఎన్నో మ‌లుపుల త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ క‌మ‌లం గూటికి చేరుకున్నారు.దీంతో టీఆర్ ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ అనే భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలో క‌లుగుతోంది.

కాగా ఈట‌ల రాజేంద‌ర్ వెల్లిన దారిలోనే మ‌రికొంత‌మంది వెళ్ల‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.ఇందులో మ‌రీ ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌ల‌మైన నేత‌గా పేరున్న క‌డియం శ్రీహ‌రి పేరు వినిపిస్తోంది.

వ‌రంగ‌ల్‌లో జిల్లాలో ఒక‌ప్పుడు క‌డియం తిరుగులేని నేత‌గా చ‌క్రం తిప్పారు.రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు మంచి చ‌రిత్ర ఉంది.

క‌డియం గ‌త ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా అలాగే విద్యాశాఖ మినిస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.అప్పుడు వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల‌కు టీఆర్ ఎస్ త‌ర‌ఫున క‌డియం నేతృత్వం వ‌హించారు.

కానీ ఇప్పుడు కేసీఆర్ ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు.ఆయ‌న్ను కేబినెట్‌లోకి తీసుకోకుండా కేవ‌లం ఎమ్మెల్సీగానే కొన‌సాగిస్తున్నారు.

Telugu @bjp4india, Etela Rajender, Kadiyam Srihari, Kadiyamsrihari, Kcr-Telugu P

అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా గ‌డువు తీరిపోవ‌డంతో క‌డియం గంద‌ర‌గోళంలో ప‌డ్డారు.ఇంకోసారి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని కోరుతున్నారు.కానీ కేసీఆర్ మాత్రం ఆయ‌న‌కు ఇచ్చే ఆలోచ‌న‌లో లేర‌ని స‌మాచారం.ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్స ఇవ్వ‌కుంటే క‌మ‌లం గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంట‌.అయితే ఆయ‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగే దాకా వెయిట్ చేయాల‌ని భావిస్తున్నారు.ఇస్తే టీఆర్ ఎస్‌లోనే ఉంటార‌ని లేకుంటే బీజేపీ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఆయ‌న‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు నుంచి పోటీ ఉండ‌టంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.ప్ర‌స్తుతం ఆయ‌న చాలా కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

చూడాలి మ‌రి దేనికి జై కొడుతారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube