టెన్త్, ఇంటర్ పరీక్షల పై కీలక కామెంట్లు చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి..!!

టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ రాజకీయ ముఖ చిత్రం రోజుకో విధంగా మారుతుంది.ఇప్పటికే ప్రతిపక్షాలు కరోనా తీవ్రత కారణంగా పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఉన్నాయి.

 Ap Education Minister Sensatational Comments Adhimulapu Suresh, Ys Jagan,ap Educ-TeluguStop.com

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వాలు ఆటలాడ కూడదన .మండిపడుతున్నాయి.ముఖ్యంగా నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు ప్రభుత్వం నిర్వహించకూడదని అవసరమైతే ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు జరిపించుకోవాలి అని సూచించారు.ఇటువంటి తరుణంలో తాజాగా విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొనడం జరిగింది.

నాడు-నేడు అనే కార్యక్రమం సమీక్ష సమావేశంలో సీఎం జగన్ టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని తాజాగా చెప్పుకొచ్చారు.అంతకుముందు జులై మాసం ప్రారంభంలో ఇంటర్ పరీక్షలు ఆఖరి లో టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

  దీంతో తాజా సమావేశంలో సీఎం జగన్ క్లారిటీ ఇస్తారని అందరూ భావించారు.కానీ పరీక్షల విషయంలో ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలపడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.

అదే రీతిలో పరీక్షల విషయంలో సుప్రీం కోర్టు నుండి ఎటువంటి నోటీసులు ప్రభుత్వానికి అందలేదని ఒకవేళ నోటీసులు వస్తే ప్రభుత్వం యొక్క వాదన వినిపిస్తామన మంత్రి చెప్పుకొచ్చారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube