వామ్మో.. అఖిల్ సార్థక్ బెడ్ రూమ్ లో మోనాల్ గజ్జర్.. మ్యాటర్ అలా లీక్ అయ్యింది!

బిగ్ బాస్ సీజన్ లలో ట్రయాంగిల్ లవ్ తో ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన జంట మోనాల్, అఖిల్. అంతే కాకుండా మోనాల్ తో టైటిల్ విన్నర్ అభిజిత్ కూడా ప్రేమాయణం చేయగా తమ మధ్య బంధం మధ్యలోనే తెగిపోయింది.

 Akhil Sarthak, Bedroom, Monal Gajjar, Photo,latest Viral Social Media-TeluguStop.com

ఇక ఆ తర్వాత మోనాల్.అఖిల్ తో ఎంతలా లవ్ ట్రాక్ నడిపిందో చూసాం.

బాగా ఎమోషనల్, లవ్, హగ్, ముద్దులతో బాగా రెచ్చిపోతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఇక ఈ జంట బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా తమ మధ్య ప్రేమను మరింత పెంచుకున్నారు.

Telugu Akhil Sarthak, Bedroom, Monal Gajjar-Movie

ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడం, ఫోటోలు దిగడం వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం అలా బాగా వైరల్ గా మారింది.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.తెలుగు అబ్బాయి.గుజరాతి అమ్మాయి అనే టైటిల్ తో అతి త్వరలో ముందుకు రానున్నట్లు ప్రకటించగా.ఇప్పటివరకు ఈ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొన లేదు.ఇదిలా ఉంటే అఖిల్ తన బెడ్ రూములో ఏకంగా మోనాల్ ఫోటోనే పెట్టుకున్నాడు.

Telugu Akhil Sarthak, Bedroom, Monal Gajjar-Movie

వీరిద్దరూ హౌస్ నుండి బయటకు వచ్చాక పలు ఆఫర్ లతో బాగా బిజీగా మారారు.అఖిల్ ఓ సినిమాలో నటించగా, మోనాల్ ఓ డాన్స్ షోలో జడ్జి గా చేసింది.అంతే కాకుండా ఓ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.ఇక అఖిల్ తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ తో ఇంటర్వ్యూలో పాల్గొనగా అది తన ఇంట్లోనే జరిగింది.

అందులో తను బెడ్ రూమ్ లో కూడా చూపించగా అక్కడ మోనాల్ గజ్జర్ ఫోటో కనిపించింది.ఇక మోనాల్ గురించి మాట్లాడుతూ.మోనాల్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన ఫ్యామిలీ టైప్ అని అందుకే తన ఫోటోని బెడ్ రూమ్ లో పెట్టుకున్నానని తెలిపాడు.ఇక తన కోసం ఎక్కువగా ఆలోచించే వాళ్ళల్లో మోనాల్ ఒకరిని అందుకే తనంటే అంటే ఇష్టమని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube