పీసీసీపై సోనియాకు ఆ ఎమ్మెల్యేల లేఖ‌.. రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా?

గ‌తేడాది నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ ప‌ద‌విపై పెద్ద ఎత్తున దుమారం న‌డుస్తోంది.ఎప్పుడైతే ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి అగ్ర‌నేత‌ల న‌డుమ తీవ్ర స్థాయిలో పోటీ నెల‌కొంది.

 Those Mlas Letter To Sonia On Pcc  To Give A Check To Revanth, T Congress, Revan-TeluguStop.com

ప్ర‌ధానంగా రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పేర్లు విన‌ప‌డ్డాయి.అయితే మిగ‌తా వారు కూడా త‌మ‌కే ఇవ్వాలంటూ ప‌ట్టుప‌డుతున్నారు.

ఈ విధంగా తీవ్ర‌మైన పోటీ అప్ప‌ట్లోనే రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపింది.ఇక వీహెచ్ లాంటి నేత‌లు డైరెక్టుగానే విమ‌ర్శ‌ల‌కు దిగారు.రేవంత్‌కు ఇవ్వొద్ద‌ని చాలామంది ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ హెచ్చ‌రించారు.ఇక ఇలాంటి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో అప్ప‌ట్లో ఈ ఎంపిక‌ను ఆపేశారు.

తాత్కాళికంగా ఉత్త‌మ్‌నే కొన‌సాగించారు.కానీ ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు పీసీసీ ప‌ద‌వి ఎంపిక వ‌చ్చింది.

ఇక అంతే సంగ‌తి.సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.

ఇక ఎన్ని ఒత్తిడిలు వ‌చ్చినా అవ‌న్నీ ప‌క్క‌కుపెట్టి రేపో ఎల్లుండో అధ్యక్షుడిని నియ‌మిస్తార‌ని అంతా అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద సంచ‌ల‌నం రేగింది.పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు.

Telugu @revanth_anumula, Revanth Reddy, Congress Mals, Tcongress Mlas, Tpcc-Telu

దీన్ని భ‌ద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్ మీద పంపుతూ దానిపై వారంతా సంత‌కాలు కూడా చేశారు.పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండే అభ్య‌ర్థికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ట్రాక్ రికార్డ్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్నారు.అలాగే అత‌ను కాంగ్రెస్‌కు చేసిన కృషితో పాటు లోక‌ల్ లీడ‌ర్ల మ‌నోగ‌తాల‌ను దృష్టిలోపెట్టుకోవాల‌ని కోరారు.ఇవ‌న్నీ అంశాలు రేవంత్‌కు వ్య‌తిరేకంగానే రాసిన‌ట్టు స్ప‌స్ట‌మ‌వుతోంది.రేవంత్‌కే ఇస్తార‌న్న వార్తల నేప‌థ్యంలో వీరంతా క‌లిసి లెట‌ర్ రాశారు.ఈ ముగ్గురు రేవంత్‌కు ఆది నుంచే వ్య‌త‌రేకంగా ఉన్నారు.

చూడాలి మ‌రి ఎవ‌రికి ఇస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube