జూలై 26 నుండి ఏపీలో 10వ తరగతి పరీక్షలు..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ టెన్త్, ఇంటర్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని ప్రతిపాదనలు చేసింది ఏపీ విద్యాశాఖ.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్తి అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహించాలని చూస్తుంది.

 Ap Educational Ministry Schedule For 10th Class Exams, 10th Class, Ap, Educati-TeluguStop.com

ఈ క్రమంలో జూలై 26 నుండి ఆగష్టు 2 వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా 4 వేల సెంటర్స్ లో 6.28 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని అన్నారు.

కరోనా టైం లో విద్యార్ధుల మీద మానసిక ఒత్తిడి లేకుండా ఉండేందుకు పదవ తరగతి 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లే ఉండేలా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ చిన వీరభద్రుడు వెల్లడించారు.

సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులు 100 మార్కులకు పెడుతున్నారు.భౌతిక, రసాయన శాస్త్రం పేపర్ 1గా జీవ శాస్త్రం పేపర్ 2 గా 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.

ఇక పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ఇలా ఉండగా ఇంటర్ పరీక్షలను జూలై 7 నుండి 25 వరకు నిర్వహించాలని ప్రతిపాదనలు సూచించింది.ఈ పరీక్షలపై విద్యా శాఖ సీఎం వైఎస్ జగన్ తో ఈరోజు సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తుంది.

సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.ముందుగానే షెడ్యూల్ విడుదల చేసి పరీక్షలకు విద్యార్ధులను ప్రిపేర్ అయ్యేలా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube