హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్‌ పై వేటు..!

భారత్ లో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

 Azharuddin Hunted For Hca Presidency Azharuddin Hca,apex Council, Removed, Hca P-TeluguStop.com

అందుకే క్రికెట్ ఆట డెవలప్మెంట్ కోసం వివిధ సంఘాలు పుట్టుకొచ్చాయి.అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా క్రికెట్ అసోసియేషన్ అనేది ఏర్పాటు అయ్యింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే ఈ హైదరాాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చాలా రోజుల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి.

దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్ అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ను తొలగించారు.

అయితే ఆయనను తొలగించడం వెనక ఓ పెద్ద కథే ఉంది.అయితే ఈ విషయం పై అజారుద్దీన్ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ నోటీసులపై అజారుద్దీన్‌ ఫైర్ అయ్యాడు.

అజారుద్దీన్‌ మాట్లాడుతూ తనకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని తెలిపారు.

హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తాను ఏ పని చేయలేదని తెలిపాడు.అపెక్స్‌ కౌన్సిల్‌ లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారని, వాళ్ల నిర్ణయమే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయంగా చెబితే ఎలాగని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ ను నియమిస్తే అడ్డుకున్నారని, వాళ్ల అవినీతి బయటపడుతుందనే తనపై కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని అజహర్‌ పైనే హెచ్‌సీఏ తగిన చర్యలు తీసుకోవడం కలకలం రేపుతోంది.

Telugu Apex Council, Azharuddin Hca, Hca, Removed, Ups-Latest News - Telugu

అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.హెచ్‌సీఏ సభ్యత్వం నుంచి అజారుద్దీన్ ని తప్పిస్తున్నట్లు తెలిపింది.అజహర్ స్పందించకపోవడంతో ఇటువంటి ఘటన చోటుచేసుకుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube