అలర్ట్: ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త వైరస్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు..!

ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ కదలికలు కనిపిస్తున్నాయట.జోకర్ అంటే ఏంటో అనుకోకండి.ఇది చాలా ప్రమాదకరమైన మాల్‌ వేర్‌.దీనిని పూర్తిగా నాశనం చేయడానికి దాదాపు మూడేళ్లపాటు శ్రమించామని అప్పట్లో గూగుల్‌ ఒక ప్రకటనలో ప్రకటించుకుంది.అయితే మళ్ళీ పోయిన సంవత్సరం జులైలో గూగుల్‌ ప్లే స్టోర్‌ లో మళ్లీ జోకర్‌ కదలికలు కనిపించాయి.

 Alert Andorid Users, New Virus, Latest News, Viral, Andorid Phone Users, Be Care-TeluguStop.com

ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ మాల్వేర్ ద్వారా ఎంతో మంది యువత డబ్బులు పోగొట్టుకున్నారు.ఈ మాల్వేర్‌ వైరస్ చాలా ఖతర్నాక్ లాంటిది.

మనకి తెలియకుండానే మన ఫోన్ లో ఉన్న సంబంధించి బ్యాంకింగ్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.అసలు ఈ జోకర్ మాల్వేర్ మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చింది.

అప్పుడు అప్రమత్తమైన గూగుల్ కొన్ని అనుమానాస్పద యాప్‌ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Telugu Andorid Phone, Andorid, Care Full, Latest-Latest News - Telugu

మాల్ వేర్ పూర్తిగా పోయిందని భావించే లోపే మళ్ళీ కేసులు నమోదవుతుండడంతో పోలీసులు అలర్ట్ చేశారు.అయితే., ఈ జోకర్ మాల్వేర్ నుంచి రక్షణ పొందటానికి ఇలాంటి జాగ్రత్తలు పాటించండి.

జోకర్ మాల్వేర్‌ నుంచి రక్షణ పొందటానికి మీ ఫోన్ కు వచ్చే అవసరం లేని యాప్‌ లకు సంబందించిన ఎస్ఎమ్మెస్ యాక్సెస్‌ ను ముందుగా తొలగించండి.అలాగే ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌ బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్‌ లో స్టోర్ చేయడం గాని, నోట్ చేసుకోవడం గాని చేయకండి.

అవసరంలేని యాప్‌ లను అన్ ఇన్‌స్టాల్ చేసుకొండి.ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ అన్నీ నిజమైనవే అని గుడ్డిగా నమ్మకండి.ఒకవేళ ప్లేస్టోర్‌ లో ఉన్నా సరే అనుమానం ఉంటే ఆ యాప్ జోలికి పోకపోవడమే మంచిది.

Telugu Andorid Phone, Andorid, Care Full, Latest-Latest News - Telugu

అలాగే క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, ఫోన్‌లో సేవ్ చేయకండి.మీ ఫోన్ ను కాపాడేందుకు వాడే యాంటీ వైరస్‌ నాణ్యమైందా లేదా అని ఒక్కసారి చెక్ చేయనుకోండి.మాల్వేర్‌ కు సంబంధించి మోసాలు పెరుగుతోన్న నేపథ్యంలో పోలీసులు నెటిజన్లను అలర్ట్ చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో జోకర్ మాల్వేర్‌ కు సంబంధించిన లింక్‌ లను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.అలాగే ఎటువంటి యాడ్స్ వచ్చిన వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీ డేటా మొత్తం చోరీ అయ్యే ప్రమాదం ఉంది.

మాల్వేర్‌కు సంబంధించి మోసాలు పెరుగుతోన్న నేపథ్యంలో పోలీసులు నెటిజన్లను హెచ్చరిస్తున్నారు.కాబ్బటి ఈ జోకర్ విషయంలో జాగ్రత్త వహించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube