జనసేనతో పొత్తు బీజేపీ మర్చిపోయిందా ? 

మనుషులు కలిసినా , మనసులు కలవలేదు అన్నట్టుగా ఉంది ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని ముందుగా నిర్ణయించుకున్నాయి.

 Janasena Is Dissatisfied That The Bjp Is Not Giving Priority To Them Bjp, Janase-TeluguStop.com

ఆ మేరకు కలిసి ఉమ్మడిగా మొదట్లో కార్యక్రమాలు చేపట్టాయి.బీజేపీ, టిడిపి పొత్తు తప్ప మరే పార్టీతోనూ తాము కలిసేది లేదు అన్నట్లుగా ఆ రెండు పార్టీల నేతలు వ్యవహరించారు.

కానీ మొదటి నుంచి బీజేపీ అగ్రనేతలు ఎవరు పవన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.మోదీ, అమిత్ షా వంటివారు పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కూడా పవన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఇప్పటికీ బాధ  కలిగిస్తోంది.

 అదీకాకుండా ఏపీ అధికార పార్టీ వైసీపీతో బీజేపీ సన్నిహితంగా మెలగడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం జనసేనకు, జనసేన అవసరం బీజేపీకి ఉండడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా , ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి.

అప్పుడప్పుడు ఏపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నా, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

కొద్ది రోజుల క్రితం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన సందర్భంగా జనసేన తో కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేయాలని నిర్ణయించారు.

Telugu Amith Sha, Bjpjanasena, Chandrababu, Janasena, Janasenani, Modhi, Pavan K

 కానీ బీజేపీ ఆస్తిపన్ను పెంపుకు నిరసనగా దీక్ష చేపట్టింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రి లో నిరసన చేపట్టారు.అన్న వచ్చాడు పన్నులు పెంచాడు అంటూ హడావుడి చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి జనసేన కు ఆహ్వానం లేకపోవడం, ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి ని కలిగించింది.ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దాం అంటూ ప్రకటనలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కలుపుకు   వెళ్లడంలేదని , అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే తమకు పెద్ద మైనస్ అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Amith Sha, Bjpjanasena, Chandrababu, Janasena, Janasenani, Modhi, Pavan K

ఇదిలా ఉండగా పవన్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు, కేంద్రమంత్రిగా అవకాశం కల్పిస్తున్నామని బీజేపీ లీకులు ఇస్తూ ఉండడం, దాంట్లో వాస్తవం లేకపోవడం వంటివి జనసేన కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.అసలు తమతో పొత్తు ఉందనే విషయం బీజేపీ మర్చిపోయినట్లు వ్యవహరిస్తోందని, ఇలా అయితే పార్టీ నాయకుల్లో పొత్తు విషయమై తీవ్ర అసంతృప్తి చెలరేగే అవకాశం ఉంది అనే అభిప్రాయాలుు వక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube