ఆకాశం నీ హద్దురా మూవీకి మరో అరుదైన గౌరవం

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన సూరరై పొట్రు మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.తమిళ్, తెలుగు బాషలలో నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 Aakasam Nee Haddura Movie Get Promax Awards India Region Gold, Hero Surya, Sudha-TeluguStop.com

డిజిటల్ లో రిలీజ్ అయిన ఊహించని స్థాయిలో సూపర్ హిట్ టాక్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.ఆకాశం నీ హద్దురా టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది.

రియల్ లైఫ్ స్టొరీ స్ఫూర్తితో ఈ మూవీని సుధా కొంగర తెరకెక్కించారు.ఇక ఈ మూవీ విశేషమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో ఆస్కార్ అవార్డులకి కూడా నామినేట్ అయ్యి ఫైనల్ స్టేజ్ లో వరకు వెళ్ళింది.

అలాగే షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులని సొంతం చేసుకుంది.

Telugu Aakasamnee, Promaxawards, Surya, Kollywood, Sudha Kongara, Tollywood-Movi

ఐఏండిబీ రేటింగ్స్ లో వరల్డ్ లో అత్యంత ప్రజాదారణ కలిగిన మూడో చిత్రంగా ఆకాశం నీ హద్దురా నిలిచింది.అలా వరుసగా అరుదైన గౌరవం, గుర్తింపు సొంతం చేసుకుంటున్న సూరరై పొట్రు మూవీ ఇప్పుడు మరో అవార్డుని సొంతం చేసుకుంది.ప్రైమ్ వీడియో ప్రోమాక్స్ ఇండియా రీజియన్ అవార్డ్స్ కేటగిరీలో ఆకాశం నీ హద్దురా గోల్డ్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది.

అత్యంత ప్రజాదారణ, విస్తృత చర్చలు, వ్యూస్ ఆధారంగా అమెజాన్ ప్రైమ్ ఈ అవార్డుని ఆకాశం నీ హద్దురాకి ప్రకటించడం విశేషం.మొత్తానికి ఇప్పటికే వరుసగా అరుదైన గౌరవం, అవార్డులని సొంతం చేసుకున్న సూరరై పొట్రు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా గోల్డ్ అవార్డు సొంతం చేసుకోవడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకుందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube