ప‌వ‌న్ నేతృత్వంలో త్వ‌ర‌లోనే ఫ్రంట్‌.. తెర‌పైకి కొత్త డిమాండ్‌

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ వార్ వ‌న్‌సైడ్ లోనే న‌డుస్తోంది.వైసీపీకి ఎదురే లేకుండా పోతోంది.

 Janasena Leader Pawan Kalyan To Start Front, Political Leaders, Ycp, Bjp, Tdp Al-TeluguStop.com

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ పూర్తిగా డీలా ప‌డిపోయింది.ఏ ఎన్నిక‌ల‌యినా వైసీపీకి ఎదురే లేకుండా పోతోంది.

క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోతోంది టీడీపీ.ఇంకోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు.

ఈ రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య టీడీపీ ఓ నిర్ణ‌యం తీసుకుంది.
ఎలాగైనా మ‌ళ్లీ పూర్వ వైభ‌వం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది.

చంద్ర‌బాబు నాయుడు ఈ మేర‌కు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేస్తున్నారు.అయినా బీజేపీ మాత్రం టీడీపీ పేరెత్తితేనే భ‌గ్గుమంటోంది.

ఇంకోవైపు జ‌న‌సేన‌తో మాత్రం పొత్తు పెట్టుకుని త‌మ సీఎం అభ్య‌ర్థి ప‌వ‌నే అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.కానీ ప్ర‌తిప‌క్షాలన్నీ ఇలా ఒంటిరిగా పోరాడితే ఫ‌లితం ఉండ‌ద‌ని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి.

Telugu @anuradhatdp, Chandrababu, Janasenapawan, Janasenapavan, Pawan Kalyan, Ys

ఇందుకోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించాలంటూ ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి ఫ్రంట్‌గా ఏర్ప‌డాల‌నే డిమాండ్ తెర‌మీద‌కు వ‌స్తోంది.ఇందుకోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని కొత్త డిమాండ్ లేవ‌నెత్తుతున్నారు నేత‌లు.కానీ బీజేపీ ఇక్క‌డ టీడీపీని ఫ్రంట్‌లోకి రావ‌డాన్ని ఒప్పుకుంటుందా లేదా అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌.ఒక‌వేళ ఒప్పుకుంటే చంద్ర‌బాబు నాయుడు జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల్సి వ‌స్తుంది.మ‌రి ఆయ‌న అందుకు సిద్ధ‌ప‌డ‌తారా అన్న‌ది కూడా స‌వాలే.ఈ కొత్త డిమాండ్ గ‌న‌క స‌క్సెస్ అయితే ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటికీ మంచి ప‌ట్టు దొర‌కిన‌ట్టు అవుతుంది.

అయితే పెద్ద‌గా రాజ‌కీయ నేత‌లు లేని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను అన్ని పార్టీలూ స్వాగ‌తిస్తాయా లేదా అన్న‌ది చూడాలి.సెంట్ర‌ల్ లో బీజేపీ, స్టేట్‌లో టీడీపీ అండ‌తో జ‌న‌సేన బ‌ల‌ప‌డేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి.

మ‌రి ఈ అవ‌కాశాన్ని ప‌వ‌న్ ముందుకు తీసుకెల్తారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube