ఆటో వాడిని పెళ్లి చేసుకుంటే ఇలాగే చూసుకుంటాడంటూ స్టార్ హీరోయిన్ ఫోటో పై...

ఈ మధ్య కాలంలో యువతి లేదా యువకుడు ప్రేమ, పెళ్లి వంటి విషయాలలో అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ క్రమంలో కౌమారదశలో కలిగే ఫీలింగ్స్ ని ప్రేమ అనుకుంటూ భ్రమ పడుతున్నారు.

 Anushka Sharma And Varun Dhawan Memes Viral In Social Media, Anushka Sharma, Va-TeluguStop.com

ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేకపోయినప్పటికీ పెళ్లి చేసుకొని  చిన్న వయసులోనే చాలా కష్టాలను అనుభవిస్తున్నారు.ఈ క్రమంలో కొంత మంది ఏకంగా తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించి ఓ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అందమైన ఫోటోని మరియు ఆమె హీరోయిన్ గా నటించిన “సూయి ధగా” చిత్రం లోని  ఓ డీ గ్లామర్ ఫోటోని పక్కపక్కన పెట్టి మీమ్ క్రియేట్ చేశారు.

ఇందులో అందమైన ఫోటోకి తన తల్లిదండ్రులు ఆమెను ఎలా చూసుకునేవారో, అలాగే డీగ్లామర్ ఫోటోకి పెళ్లయిన తర్వాత భర్త ఎలా చూసుకునేవాడో వ్యత్యాసం  చూపించారు.దీంతో నెటిజనులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

  అంతే కాకుండా మరి కొంత మంది అయితే మొదటి ఫోటోలో తన తల్లిదండ్రులు బాగానే చేసుకున్నప్పటికీ రెండవ ఫోటోలో ఆటో వాడిని పెళ్లి చేసుకుంటే ఇలాగే చూసుకుంటాడంటూ ఫన్నీ గా  కామెంట్లు చేస్తున్నారు.ఇంకొంతమంది మాత్రం అందుకే  చదువుకునే వయసులో ప్రేమ, పెళ్లి  గురించి ఆలోచించి చదువు సంధ్యలపై దృష్టి సారించకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఇలాగే ఉంటుందని వ్యంగాంగా కామెంట్లను చేస్తున్నారు.

Telugu Anushka Sharma, Anushkasharma, Bollywood, Varun Dhawan-Movie

అయితే ఈ మధ్య కాలంలో మీమ్ క్రియేటర్స్ కూడా తమ మీమ్స్ తో ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నారు.దీంతో మున్ముందు మీమ్ క్రియేటర్స్ కి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ఇటీవల కాలంలో పలు చిత్రాల యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ కోసం “మీమ్ అడ్మిన్స్” ని బాగానే ఉపయోగించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube