పని ఉంటేనే ఫుడ్డు.. లేకపోతే నా కుటుంబం గడవదు.... 

తెలుగులో పలు చిత్రాలు మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “రాజేంద్ర చౌదరి” గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే రాజేంద్ర చౌదరి గతంలో ఆది, ఎవడైతే నాకేంటి, తదితర చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

 Telugu Actor Rajendra Chowdary About Telugu People Movie Offers-TeluguStop.com

  నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి రాజేంద్ర చౌదరి పలు అనివార్య కారణాల వల్ల గుర్తింపుకి నోచుకో లేకపోయాడు.అయితే తాజాగా నటుడు రాజేంద్ర చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాల విషయంలో తెలుగు వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లోని పాత్రల కోసం పరభాషా నటులను ఎంపిక చేసుకుంటున్నారని దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న నటీనటులు అవకాశాలు లేక ఉపాధి కోల్పోతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అయితే తాను సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఆర్టిస్టుగా బాగానే ప్రూవ్ చేసుకున్నానని అయినప్పటికీ తనకు సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల కొంతమేర బాధ పడినప్పటికీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తనకు మంచి అవకాశం వచ్చి వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అయితే తనకి నటన కాకుండా ఎలాంటి వ్యాపారాలు మరియు  ఆర్థిక పరమైన పెట్టుబడులు వంటివి లేవని కేవలం తాను నటనపై మాత్రమే ఆధారపడి తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని తెలిపాడు.

Telugu Telugu, Telugurajendra-Movie

తాను సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటానని అంతేకాకుండా ఎలాంటి సమస్యలు గొడవలలోకి తాను తలదూర్చనని అందువల్లే తనకు పెద్దగా  ఫేమ్, గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చాడు.దాదాపుగా 100కు పైగా చిత్రాలలో రాజేంద్ర చౌదరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి విలన్ పాత్రలు వంటి వాటిలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు అంతేకాకుండా పలు ధారావాహికలలో కూడా నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube