స్పెషల్ సాంగ్స్ లో నటిస్తున్న ఒకప్పటి హీరోయిన్...

సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఎలాగైనా ఒక్క అవకాశాన్ని దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకోవాలని చాలా మంది నటీనటులు తహతహలాడుతుంటారు.ఈ క్రమంలో కొందరు ఎలాంటి పాత్రలోనైనా నటిస్తుంటారు.

 Telugu Actress Meghna Naidu Special Songs News, Meghna Naidu, Telugu Actress, Me-TeluguStop.com

కానీ చివరికి వారు మొదట్లో అవకాశాల కోసం నటించిన  పాత్రలే వారి సినీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి.కాగా పలు తెలుగు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ నటి మేఘన నాయుడు కూడా ఈ కోవకే చెందుతుంది.

అయితే నటి మేఘనా నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో సినిమా పరిశ్రమకి వచ్చింది.

అయితే సినిమాల్లోకి రాకముందు మేఘన నాయుడు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో డాన్సర్ గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.ఇందులో భాగంగా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, టి- సీరీస్ తదితర ప్రముఖ మ్యూజిక్ సంస్థలలో పని చేసింది.

ఈ క్రమంలో పలు తెలుగు చిత్రాలలోని స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలను దక్కించుకుంది.ఇందులో భాగంగా దాదాపుగా 15కు పైగా చిత్రాలలో స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలలో నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

కాగా సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో మేఘన నాయుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.దీంతో చివరికి డాన్సర్ గా తన కెరియర్ ని సరి పెట్టుకుంది.

Telugu Meghna, Telugu Actress, Teluguactress, Tollywood-Movie

కాగా మేఘన నాయుడు తన కెరీర్ ని మొదలు పెట్టిన కొత్తలో “కాలియోన్ కా చమన్” అనే సాంగ్ ద్వారా బాగా పాపులర్ అయింది.ఆ తర్వాత తెలుగులో “పృధ్వి నారాయణ” అనే చిత్రంలో స్పెషల్ సాంగ్స్ లో నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత విక్రమార్కుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పాండు రంగడు, 100% లవ్, పిల్ల జమిందార్, తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.కాగా 2016వ సంవత్సరంలో  “లూయుస్ మింగిల్ రైస్” అనే పోర్చుగీస్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube