కారు నుంచి వస్తున్న వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా..?!

వృక్షో రక్షిత రక్షితః అని అన్నారు మన పెద్దలు.కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కడ చూసినా కానీ అడవుల అన్నిటినీ నాశనం చేస్తూ ఉన్నారు.

 Bonnet, Engine, Strange Sound, Rat , Viral News, Viral Latest,edin Burg-TeluguStop.com

అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టడం, చెట్లకు స్థలం లేకుండా చేయడం మనం చూస్తూనే ఉన్నాం.దాంతో జంతువులు ఇబ్బంది పడి అవి ఉండే నివాసాలు వదిలేసి జనావాస ప్రాంతాలకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇలాంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం.అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనుషుల వల్ల వాటికి ఎలాంటి హాని కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కొన్ని జంతువులు అస్సలు ఊహించని విధంగా ఉండే ప్రదేశాలలో దాక్కొనిపోతాయి.

అచ్చం అలాంటి సంఘటన ఒకటి తాజాగా స్కాట్‌ ల్యాండ్‌ లో జరిగింది.

Telugu Bonnet, Engine, Strange Sound, Latest-Latest News - Telugu

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… స్కాట్‌ ల్యాండ్‌ లోని ఎడిన్‌ బుర్గ్‌ లో ఒక మహిళ బయటకు వెళ్లేందుకు తన కారును స్టార్ట్ చేద్దామని ట్రై చేయగా, ఇంజన్ నుంచి వింత వింత శబ్దాలు రావడం గమనించింది.దీంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంకాక ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది.అయితే చివరకు ఆ మహిళ కార్బోనేట్ ఓపెన్ చేసి చూడగా ఆ మహిళకు అనుకోని సంఘటన ఎదురయ్యింది.

ఇంతకు ఆ మహిళకు ఏమి కనపడిందన్న విషయానికి వస్తే.ఒక ఎలుక జాతికి చెందిన ఓ బీవర్ ఇంజన్ దగ్గర దాక్కొని ఉంది.ఒక్కసారిగా ఆ బీవర్ ను చూసి ఆ మహిళ గట్టిగా అరవడం మొదలు పెట్టేసరికి చుట్టుపక్కల వారు అందరూ కూడా అక్కడకు చేరుకొని ప్రముఖ అధికారులకు సమాచారం అందజేశారు.దీంతో సంఘటన స్థలానికి యానిమల్ రెస్క్యూవర్స్ అక్కడకు చేరుకొని ఇంజిన్ దగ్గర నుంచి బీవర్‌ ను చాలా సురక్షితంగా బయటకు తీశారు.

దీనితో ఒక్కసారిగా ఆ మహిళకు ఊపిరిపీల్చుకున్నట్లు అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube