హుజూరాబాద్ మ‌రో దుబ్బాక అవుతుందా..?

తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ వేదిక‌గానే జ‌రుగుతున్నాయి.ఇక్క‌డ టీఆర్ ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న మాదిరిగా పోటాపోటీ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 Will Huzurabad Become Another Dubaka , Etala, Trs, Bjp, Etela Rajender, Dubbaka,-TeluguStop.com

ఎలాగైనా గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది.అలాగే సిట్టింగ్ ప్లేస్‌లో గెలిచి త‌న‌కు ఎదురులేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ నిరూపించుకోవాల‌ని చూస్తున్నారు.

అయితే ఈ హుజూరాబాద్ రాజకీయాలు గ‌తంలో జ‌ర‌గిన అన్ని ఎన్నిక‌ల కంటే హీటు పుట్టిస్తున్నాయి.

నాలుగుసార్లు వ‌రుస‌గా గెలిచి ఓట‌మ‌నేది లేకుండా ముందుకుసాగుతున్న ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు బీజేపీలో చేర‌డంతో టీఆర్ ఎస్‌కు గ‌ట్టిపోటీ ఎదురైంది.

దీంతో హుజూరాబాద్ కూడా గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఒక‌టైన దుబ్బాక అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.దుబ్బాక‌లో టీఆర్ ఎస్‌కు అనూహ్య‌మైన ఎదురుదెబ్బ త‌గిలింది.

అక్క‌డ బీజేపీ నుంచి పోటీచేసిన ర‌ఘునంద‌న్‌రావు గెలిచారు.అయితే ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా బీజేపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ పోటీచేస్తుండ‌టంతో టీఆర్ ఎస్‌కు క‌ష్టాలు త‌ప్పేలా లేవు.

ఇక్క‌డ కూడా ఈట‌ల రాజేంద‌ర్ గెలిస్తే హుజూరాబాద్ మ‌రో దుబ్బాక అవ‌డం ఖాయం.ఇప్ప‌టికే రాజ‌కీయాలు ర‌ణ‌రంగంలా మారాయి.

Telugu @ktrtrs, Dubbaka, Etela, Etela Rajender, Huzurabad, Kcr Etela, Trs-Telugu

ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాకముందే అన్ని పార్టీలూ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశాయి.ప్ర‌ధానంగా ఈట‌ల‌కు టీఆర్ ఎస్‌కు మ‌ధ్య‌నే పోటీ ఉండ‌నుంది.దీంతో వారిద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి.

టీఆర్ ఎస్ గెలిస్తే ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆగ‌మ‌వుతుంది.

ఒక‌వేళ ఈట‌ల గెలిస్తే టీఆర్ ఎస్‌కు అది పెద్ద దెబ్బ అవుతుంది.దాని ప్ర‌భావం త‌ర్వాత జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డే ఛాన్స్ ఉంది.

అందుకే ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలూ సీరియ‌స్‌గా తీసుకుంటున్నాయి.మ‌రి టీఆర్ ఎస్ ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా లేక ఈట‌ల సెంటిమెంట్ ప‌నిచేస్తుందా అనేది తేలాలంటే కొంచెం టైమ్ ప‌డుతుంది మ‌రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube