ఆ సినిమాలకు రష్మిక దూరమైనట్టే.. ఈ ట్వీటే సాక్ష్యం..?

చిన్న సినిమాలతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పెద్ద సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న రష్మిక తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Heroine Rashmika Tweet Goes Viral In Social Media, Big Movie Offers, Rashmika, S-TeluguStop.com

బాలీవుడ్ ఆఫర్ల వల్ల సౌత్ ఇండియా సినిమాలకు రష్మిక దూరం కానుందని ప్రచారం జరుగుతుండగా రష్మిక పెద్ద పనులు చేయాలని అనుకునే అమ్మాయి చిన్నచిన్న పనులను చెంతకు రానివ్వదని తనకు ఎవరో చెప్పారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ మాట తనకు సరిగ్గా సరిపోతుందని రష్మిక వెల్లడించారు.

అయితే రష్మిక చేసిన ట్వీట్ లో స్పష్టత లేకపోవడంతో ఆ ట్వీట్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రష్మిక చిన్న సినిమాలకు దూరం కానుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే రష్మిక బాలీవుడ్ సినిమాలకు దూరం కానుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక స్పందిస్తే మాత్రమే ఈ ట్వీట్ గురించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

రష్మిక నిన్న రాత్రి చేసిన ట్వీట్ కు 55,000కుపైగా లైకులు రావడం గమనార్హం.ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో నటించిన సినిమాలలో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా మిగతా సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి.గతేడాది నుంచి రష్మికకు పెద్ద హీరోల సినిమాల్లో సైతం ఆఫర్లు వస్తున్నాయి.

గతేడాది రష్మిక నటించి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక నటనపై నెగిటివ్ కామెంట్స్ వినిపించినా పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదని కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి.రష్మిక తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉండగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube