వైరల్ వీడియో: అత్తారింట్లో కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌..!

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన సంఘటన.పెళ్లి అనతరం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటుంది.

 Viral Video Gift For Daughter In Law At Each Step In Mother In Law House, Celeb-TeluguStop.com

ఇక పెళ్లి తర్వాత అత్తగారి ఇంట్లోకి ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది.అయితే సాధారణంగా కొత్త కోడలు మొదటి సారిగా ఇంట్లోకి వచ్చేటప్పుడు అత్తింటి వారు చేసే మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంటి గుమ్మం ముందు నుంచి మేళతాళాలతో నవ వధూవరులు ఆహ్వానిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక అత్తింటి వారి కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడుతున్న వేల ఒక వేళ అదిరిపోయే గిఫ్ట్ ను అందచేస్తు స్వాగతం పలికారు.

ఆ నూతన వధూవరులకు గుర్తుండిపోయే రీతిగా మెట్టు మెట్టుకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ను ఇవ్వడంతో పాటు, పూల వర్షంతో ఆహ్వానించారు అత్తింటివారు.ఒక్కో మెట్టుకు ఒక్కొక్క గిఫ్ట్ గా వెండి సామాగ్రి, అలాగే నోట్ల కట్టలను గిఫ్ట్ గా ఇస్తూ ఆ కొత్త పెళ్లికూతురును ఆశ్చర్యపరిచారు.

దీంతో ఒక్కసారిగా ఇలా అత్తింటివారు పెళ్లికూతురు ఆహ్వానించడంతో ఆమె ఆనందంతో భావోద్వేగానికి గురయ్యింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియొను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube