ఎన్టీఆర్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు.ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నారు.
ఈ మూవీ క్యాస్టింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు ఫైనల్ అయినట్లు టాక్.ఇందులో కియరా అద్వానీ హీరోయిన్ గా ఖరారైందని తెలుస్తుంది.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనున్న మూవీ.
అయితే ఈ మూవీకి సంబంధించి బౌండేడ్ స్క్రిప్ట్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ సిద్ధం చేసేయడంతో కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వీలైనంత తక్కువ సమయంలో షూటింగ్ కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తారక్ తో మూవీ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.
గతంలో ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే అయ్యి మళ్ళీ ఎందుకో హోల్డ్ అయ్యింది.

ఇక అట్లీ మాత్రం తాను తమిళంలో తీసిన సినిమాలని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు.ప్రస్తుతం హిందీలో షారుక్ ఖాన్ హీరోగా ఒక ప్రోజక్ట్ ని ఫైనల్ చేసుకున్నారు.ఈ మూవీ ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే అట్లీ-తారక్ కాంబోలో ఆగిన ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తుంది.తారక్ అట్లీకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు బోగట్టా.అయితే కొరటాల, ప్రశాంత్ నీల్ చిత్రాలు పూర్తయిన తర్వాతనే అట్లీతో మూవీని తారక్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెండేళ్ళ సమయం కచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అట్లీ-తారక్ కాంబినేషన్ సెట్స్ అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అట్లీ కూడా షారుక్ మూవీ కంప్లీట్ చేసి తారక్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేసి పాన్ ఇండియా లెవల్ లో ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు బోగట్టా.