రేపటి నుండి తాజ్ మహల్ సందర్శకులకు అనుమతి..!

కరోనా వల్ల సందర్శనకు అనుమతులు లభించని కొన్ని పురాతన కట్టడాలకు ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల పర్మిషన్ ఇస్తున్నారు.చారిత్రక కట్టడం తాజ్ మహల్ సందర్శనకు బుధవారం నుండి అవకాశం కల్పించారు.

 Taj Mahal Reopens From Tomorrow, Agra, Corona Cases, Delhi, Reopens, Taj Mahel,-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటం వల్ల ఆగ్రాలో తాజ్ మహల్ సందర్శనను నిలిపివేశారు.ప్రస్తుతం కేసుల వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో ఆంక్షలు సడలించింది.

తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తాజ్ మహల్ చూడాలని అనుకునే వారు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక ఫొన్ నెంబర్ ద్వారా గరిష్టంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.తాజ్ మహల్ సందర్శనకు ఒకేసారి 650 మందిని అనుమతించనున్నారు.

సందర్శకులకు ఓకే చెప్పినా సరే నిబంధనలు పాటించేలా ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో ఏర్పాటు చేయనున్నారు.ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఆధునిక వ్యవస్థని అందుబాటులోకి తీసుకు వచ్చారు.ఢిల్లీలో కూడా కరోనా కేసులు తగ్గిన క్రమంలో తాజ్ మహల్ కు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది.అయితే తగిన నిబంధనలు పాటిస్తూ తాజ్ మహల్ ను సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు.

అయితే సంబందిత టైం షెడ్యూల్ లో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube